Can Attractive People Live Longer : అందంగా కనిపించాలని, అందరినీ ఆకర్షించాలని ప్రతి ఒక్కరూ తపన పడుతుంటారు. అందుకోసం నానా రకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తారు. అయితే అలా కనిపించే వారికి అందంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉందని అధ్యాయనాలు చెబుతున్నాయి. సాధారణ లుక్‌లో కనిపించే వాళ్ల కంటే ఎక్కువకాలం జీవించి ఉంటారట.
చక్కటి రూపంతో ఉండే వాళ్లు ఎక్కువ కాలం బతుకుతారనే విషయానికొస్తే అందంగా కనిపించడం అనే విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండటం, శరీరానికి నష్టం కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, పొగ తాగడాన్ని వదిలేయడం వంటి పనులు జీవిత కాలాన్ని పొడిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలు తూచా తప్పకుండా పాటించడం అందంగా ఉండటమే కాకుండా, బయోలాజికల్‌గా ప్రభావం చూపిస్తాయట.
జీవన విధానంపై
1950వ దశకంలో హైస్కూల్ చదువుకున్న వారిపై ఓ అధ్యయనం జరిగింది. హైస్కూల్ ఇయర్ బుక్ ఫొటోస్ ఉపయోగించి వారి వివరాలు సేకరించారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫిజికల్ హెల్త్, ఆదాయం వంటి విషయాలను నమోదు చేసుకున్నారు. ఇందులో అట్రాక్టివ్‌గా కనిపించని వారు చాలా తక్కువ కాలం మాత్రమే జీవించారని తెలిసింది. ఓ మాదిరిగా కనిపించే వాళ్లు, అట్రాక్టివ్‌గా కనిపించే వాళ్ల కంటే కాస్త తక్కువ కాలం బతికారని గుర్తించారు. ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే, అందంగా కనిపించని వాళ్లు ఎక్కువ కాలం బతకలేదు. అలాగే, ఆకర్షణీయంగా కనిపించే వాళ్లంతా ఎక్కువ కాలం బతికారని స్పష్టమూ కాలేదు. వారు అవలంభించిన జీవన విధానం, శారీరక శ్రమ అనేవే జీవిత కాలంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే వాటిపై ఆధారపడి ఉన్నాయని తేలింది. సామాజిక హోదా అనేది వారిలో ప్రత్యేకమైన సంతోషంగా బతికేలా చేసింది. కేవలం చర్మం మాత్రమే అందంగా ఉన్నవారు ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందుకోలేరు. దేహదారుఢ్యం, ఫిజికల్ అప్పీయరెన్స్ చక్కగా ఉన్నవాళ్లు మాత్రమే మిగతా వారి కంటే ఎక్కువ కాలం బతికారు.
అందుకే తక్కువ కాలం
తక్కువ జీవిత కాలం బతికిన వారిలో సామాజిక వివక్ష, ఆర్థికపరమైన ఒత్తిళ్లు బాగా ప్రభావం చూపించాయి. అంతేకాకుండా చూడటానికి అంతగా బాగుండని వారు తమ పార్టనర్ వెతుక్కోవడానికి ఆలస్యం కావడం, మరి కొందరు ఒంటరిగా ఉండిపోవడం ఎక్కువ సమస్యలు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడం, ఆర్థిక స్తోమత, విద్యాభ్యాసం కూడా వ్యక్తుల జీవితకాలంపై ప్రభావం చూపిస్తాయట. ఉదాహరణకు పెళ్లైన వారి కంటే సింగిల్‌గా ఉండే వారిలో బ్లడ్ షుగర్ అనేది స్థిరంగా ఉండటం చాలా తక్కువని అంచనా వేస్తున్నారు.
అల్యూమినియం ఫాయిల్ ప్యాక్‌తో అందం డబుల్- సెలబ్రిటీల బ్యూటీ సీక్రెట్ ఇదే! - Aluminum Foil Face Pack