Health Benefits of Overripe Bananas : మనందరమూ మాగిన అరటి పండ్లు ఇంట్లో కనిపిస్తే తినకుండా చెత్తబుట్టలో వేస్తాం. కానీ ఇలా అతిగా పండిన అరటి పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. బాగా పండిన వాటిల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు విరివిగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇవి తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయని, అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ మానవ శరీరంలో కీలక భూమిక పోషిస్తుందని పరిశోధనల సారాంశం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా తీసుకోవటం వల్ల ప్రధానంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వాతావరణంలో కలిగే మార్పుల వల్ల సంక్రమించే వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
షుగర్ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
రక్తపోటును నియంత్రిస్తుంది: మాగిన అరటి పండ్లు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఈ అరటిపండ్లలో లభిస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు వీటి ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే కణాలు దెబ్బతినకుండా రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మంటను తగ్గిస్తుంది: సాధారణంగా చాలా మందిలో అప్పుడప్పుడు గుండె మంటగా అనిపిస్తుంది. అరటిలో సాధారణంగా ఉండే యాంటాసిడ్ పదార్థం గుండె మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మాగిన అరటిపండు నుంచి ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?
జీర్ణం సులభం: జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్లు పండిన అరటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఎక్కువగా మాగిన అరటి పండు స్టార్చ్ ఫ్రీ షుగర్‌గా మారి సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. త్వరగా జీర్ణం కావటం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
క్యాన్సర్ రోగులకు మేలు: బాగా మాగిన అరటి పండ్లు క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. అరటి తొక్కలపై ఉండే ప్రత్యేక పదార్థాన్ని ట్యూమర్ నెక్రొసిస్ ఫ్యాక్టర్ అంటారు. ఇది క్యాన్సర్, ఇతర అసాధారణ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. శరీర కండరాల నొప్పితో బాధపడే వారికి కూడా పండిన అరటి పండ్లు చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. పొటాషియం పొందడం వల్ల కండరాల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అరటిపండ్లు త్వరగా పాడైపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు!
ఎన్ని తినాలంటే: అరటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అధిక మోతాదులో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావొచ్చు . నిద్ర మత్తు కూడా ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్న వాళ్లు రోజుకు ఒకటికి మించి తింటే ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు అందుకే ఆరోగ్య వంతులు కూడా రోజుకి రెండు మించి తినకుండా ఉండటమే మంచింది.ఈ అరటి పండ్లు తిన్న తర్వాత గోరు వెచ్చని మంచినీళ్లు తాగితే జలుబు, దగ్గువంటి వ్యాధులు మన దరికి చేరవు.