Janhvikapoor House : సినిమా హీరోలకే కాదు హీరోయిన్స్‌కు కూడా చాలా మందే అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. వారితో కలిసి ఒక్క సెల్ఫీ దిగితే చాలని భావిస్తుంటారు. అలాంటిది వారితో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం, గడిపే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇప్పుడు అలాంటి ఆఫర్‌నే జాన్వీ కపూర్ ఇస్తోంది! అవును మీరు చదివేది నిజమే. మీరు జాన్వీ కపూర్ అభిమాని అయితే? ఈ ముద్దుగుమ్మ తన ఇంట్లో మీరు ఉండే అవకాశం కల్పిస్తోంది.
వివరాల్లోకి వెళితే - సెలబ్రిటీలు చాలా మంది షూటింగ్‌లు నిమిత్తం చాలా ప్రదేశాలు తిరుగుతుంటారు. అదే సమయంలో తాము నివాసం ఉండేందుకు చాలా ప్రదేశాల్లో ఇళ్లను కొనుగోలు కూడా చేస్తుంటారు. అలా ప్రస్తుతం చెన్నైలో జాన్వీకి ఓ ఇల్లు ఉంది. దీనిని గతంలో శ్రీదేవి కొనుగోలు చేసిందే. అయితే ఇప్పుడీ ఇంటిని ఎయిర్ బీఎన్బీ అనే పాపులర్ రెంటల్ కంపెనీ లిస్ట్ అవుట్ చేసింది.
ఇద్దరికి ఛాన్స్ - ఫ్యాన్స్ లేదా ఇతర ట్రావెలర్స్ సినీ తారలతో కలిసి ముచ్చటించేలా, అలానే వారి నివాసంలోని కొంత ప్రదేశాన్ని రెంట్‌కు తీసుకునేందుకు వీలుగా ఎయిర్ బీఎన్బీ సంస్థ అవకాశాన్ని కల్పిస్తోంది. అలా గ్లోబల్ వైడ్‌గా ఈ బీఎన్బీ సంస్థ 11 మంది సెలబ్రిటీల లగ్జరీ ఇళ్లను లిస్ట్ చేసింది. ఇందులో చెన్నైలోని జాన్వీ కపూర్‌కు చెందిన విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఎయిర్ బీఎన్బీ సంస్థ వారు జాన్వీ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి - బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్‌లా జీవించండి అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి ఈ విషయాన్ని తెలియజేసింది.
జాన్వీ కపూర్ ఇంట్లో ఇద్దరు గెస్ట్‌లకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సదరు సంస్థ తమ వెబ్ సైట్లో పేర్కొంది. ఆ గెస్ట్‌లకు జాన్వీకపూర్ ఇంటిలోని ఒక బెడ్ రూమ్, ఒక బాత్రూంను మాత్రమే వాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం బుకింగ్ చేసుకున్న వారిలో ఆ ఇద్దరిని జాన్వీనే సెలెక్ట్ చేస్తుంది.
జాన్వీ ఎంపిక చేసిన అతిథులకు సౌత్ ఇండియన్ స్టైల్లో లంచ్ ఉంటుందని సదరు సంస్థ పేర్కొంది. అందులో జాన్వీకి ఇష్టమైన నెయ్యి పొడి రైస్, పాలకోవా, ఆంధ్రా బిర్యానీ, పెసరట్టు దోస వంటివి ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇంకా జాన్వీ తన బ్యూటీ సీక్రెట్స్, తన తల్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను గెస్ట్‌లతో షేర్ చేసుకుంటుందని వెబ్ సైట్ పేర్కొంది. మరి మీరు ఈ అవకాశాన్ని దక్కించుకోవాలంటే మే 12న సాయంత్రం 6.30కు బుకింగ్స్ ఓపెన్ అవుతాయట.
వీకెండ్ స్పెషల్ - రెండు రోజుల గ్యాప్‌లో OTTలోకి 10 క్రేజీ సినిమాలు! - This Week OTT Releases
సూట్లో సూపర్ స్టార్స్ - రజనీ, అమితాబ్ లుక్ అదుర్స్ - Rajinikanth Vettaiyan Movie