ETV Bharat / entertainment

'మహారాజ'గా విజయ్‌ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే? - Maharaja Movie Review - MAHARAJA MOVIE REVIEW

vijaysethupathi Maharaja Review : పాత్ర‌లో వైవిధ్య‌త ఉంటే హీరో, విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అని లెక్క‌లేసుకోకుండా చేస్తారు విలక్షణ నటుడు విజ‌య్ సేతుప‌తి. ఇప్పుడాయ‌న త‌న 50వ సినిమాగా మ‌హారాజ చేశారు. తాజాగా బాక్సాఫీస్ ముందుకొచ్చిందీ చిత్రం. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

source ETV bharat
vijaysethupathi Maharaja Review (source ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 9:39 AM IST

Updated : Jun 14, 2024, 11:03 AM IST

vijaysethupathi Maharaja Review;

చిత్రం: మహారాజ;

నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు;

సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌;

ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌;

సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌;

నిర్మాత: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి;

రచన, దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌;

క‌థేంటంటే ? - ఒక‌ ప్ర‌మాదంలో మ‌హారాజ(విజ‌య్ సేతుప‌తి) భార్య‌ను పోగొట్టుకుంటాడు. అతడు సినిమాలో బార్బర్. దీంతో అతడు తనకు మిగిలిన‌ ఒకే ఒక తోడు కూతురు జ్యోతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అయితే ఓ రోజు మ‌హారాజా ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్​కు వెళ్లి ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న బిడ్డ ప్రాణాలను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని కంప్లైట్ ఇస్తాడు. మ‌రి ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా ఇచ్చిన కంప్లైట్​ను తీసుకోవడానికి మొదట పోలీసులు ఎందుకు నిరాకరించారు? అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ఆ ముగ్గురు ఎవరు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే? - ఓ భిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌ర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిప‌డి ఉంటుంది. ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా నడిపారు. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన యాక్టింగ్​ హైలైట్. స‌రదా స‌ర‌దాగా మొద‌లై ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో ఎమోషనల్​గా కథ ముగుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే ట్విస్టులు, సేతుప‌తి యాక్ష‌న్ హంగామా సూపర్​గా ఉంటాయి.

ఫస్ట్​ హాఫ్​లో ఎక్కువ భాగం పాత్ర‌ల ప‌రిచ‌యాలే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన ఫీల్ క‌ల‌గ‌దు. మొదట్లో ఒక‌దానితో మ‌రొక‌టి సంబంధం లేని వేరువేరు ఎపిసోడ్స్‌లా క‌నిపించినా ఇంటర్వెల్ సమయానికి అన్నింటి మధ్య ఏదో లింక్ ఉన్న‌ట్లు అర్థమవుతుంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్‌తో క్లోజ్​ చేసిన ఇంటర్వెల్​ సీన్​ మెప్పిస్తుంది.

ఇక అనూహ్య‌మైన మ‌లుపుల‌తో సెకండాఫ్​ ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. బిడ్డ విష‌యంలో మ‌హారాజాకు జ‌రిగిన న‌ష్టం అంద‌ర్నీ షాక్‌కు గురిచేసి ప్ర‌తి ఒక్క‌రి మ‌దిని బ‌రువెక్కిస్తుంది. క్లైమాక్స్​లో బాధిత యువ‌తిగా మెయిన్​ విలన్​తో జ్యోతి చెప్పే డైలాగ్స్ స్ఫూర్తి ర‌గిలించేలా ఉంటాయి. ఫైనల్​గా ఈ క‌థ‌ను ముగింపు తీరు ప్రేక్ష‌కుల‌కు బాగా రక్తి కట్టిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే : విజ‌య్ సేతుప‌తి ఎప్పటిలాగే నేచురల్ యాక్టింగ్​తో క‌ట్టిప‌డేశాడు. ఆయ‌న న‌ట‌నే సినిమాకు మెయిన్ హైలైట్. ఆయ‌న పండించే ఎమోషన్స్​, ఇనోసెంట్​ యాక్టింగ్​, చేసే కామెడీ, త‌న‌ కూతురికి అన్యాయం చేసిన వాళ్ల‌ను వెంటాడి చంపే తీరు సేతుప‌తిలోని న‌ట‌నా ప్ర‌తిభ‌కు అద్దం ప‌డ‌తాయి. ఆయ‌న కూతురిగా జ్యోతి పాత్ర‌లో స‌చిన అద్భుతంగా నటించింది. క్లైమాక్స్​లో ఆమె చెప్పే డైలాగ్స్​ చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. మెయిన్ విలన్​గా సెల్వం పాత్ర‌లో అనురాగ్ క‌శ్య‌ప్ అద‌ర‌గొట్టారు. భార‌తీరాజా, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అరుళ్‌దాస్‌, మ‌ణికంద‌న్‌ త‌దిత‌రుల పాత్ర‌ల‌న్నీ ప‌రిధి మేర‌కు నటించాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన తీరు మెప్పించింది. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ , దినేశ్ ఛాయాగ్ర‌హ‌ణం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

చివ‌రిగా : థ్రిల్ చేస్తారు మ‌హారాజా!

బాలయ్య వచ్చేస్తున్నాడు​ - NBK 109 షూటింగ్​ ఎక్కడి దాకా వచ్చిందంటే?

'రెహమాన్ అడగలేదు - మరి మీరెందుకు అడుగుతున్నారు ఇళయరాజా!?' - Ilayarajas Copyright Issue

Last Updated : Jun 14, 2024, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.