ETV Bharat / entertainment

'నా దృష్టిలో పెళ్లంటే' - క్లారిటీ ఇచ్చిన ఊర్వశీ - ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఇంటర్వ్యూ

Urvashi Rautela Marriage : స్పెషల్​ సాంగ్స్​తో టాలీవుడ్​లో సూపర్​ క్రేజ్ సంపాదించుకుంది బీటౌన్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన అభిప్రాయం వెల్లడించింది.

Urvashi Rautela Marriage
Urvashi Rautela Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 9:51 PM IST

Urvashi Rautela Marriage : 'వాల్తేర్​ వీరయ్య' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. అప్పటి నుంచి పలు సాంగ్స్​లో మెరిసి ఇక్కడి ఆడియెన్స్​కు చేరువైంది. అయితే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది.

" ప్రేమ అనేది ఓ రెండు మనసుల కలయిక. అది రెండు వైపుల ఉండాలి. ఇద్దరు వ్యక్తులు పూర్తి అంగీకారంతోనే వివాహబంధంలోకి అడుగుపెట్టాలి. ఎదుటి వ్యక్తిపై నమ్మకం, గౌరవం ఎంతో ఇందులో ఎంతో ముఖ్యం. వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే జీవితాంతం కలిసి నడుస్తూ మనం బాధ్యతలు నిర్వర్తించాలి" అని ఊర్వశీ పేర్కొంది. ఇటీవలే బ్రో సినిమాలో మెరిసిన ఆ తర్వాత రామ్‌ బోయపాటి కాంబోలో వచ్చిన 'స్కంద'తో పాటు అక్కినేని అఖిల్‌ 'ఏజెంట్‌', సినిమాల్లోనూ కనిపించింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న ఎన్​బీకే 109లో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది.

2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊర్వశి కెరీర్​లో ఒకే ఒక్క హిట్ ఉంది. తను నటించిన తొలి చిత్రం నుంచి ఇప్పటివరకు అన్నీ ప్లాప్ చిత్రాలే కానీ, సీనియర్ హీరో పక్కన నటించే సత్తా ఉన్న నటిగా గుర్తింపు ఉండటంతో రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది ఊర్వశి.

15 ఏళ్ల వయసులో తన ఫ్యాషన్ జర్నీని ప్రారంభించిన ఊర్వశి మిస్ టీన్ ఇండియాగా 2009లో ఎంపికైంది. లాక్మే ఫ్యాషన్ వీక్, అమెజాన్ ఫ్యాషన్ వీక్, బాంబే ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్​లకు షోస్ టాపర్​గా ర్యాంప్ వాక్ చేసింది. బ్యూటీ క్వీన్, ఇండియన్ ప్రిన్సెస్ 2011, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 వంటి టైటిల్స్ గెలుచుకుంది. 2013లో సన్నీ దేవోల్​ పక్కన సింగ్ సాహిబ్ ది గ్రేట్ చిత్రంలో నటించడం ద్వారా తెరగేట్రం చేసిన ఊర్వశి నటిగా ఎక్కువ ప్లాప్ చిత్రాలతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. కానీ, హనీసింగ్ మ్యూజిక్ ఆల్బమ్ లవ్ డోస్​లో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది.

ఊర్వశి.. ఫ్లైట్​లో ఫోన్లు మర్చిపోయిందట.. మీలో ఎవరికైనా దొరికాయా?

ఓ మై గాడ్! నిమిషానికి రూ.2 కోట్లు.. హీరోకు ఓ రేటు.. అదీ ఊర్వశి రేంజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.