ETV Bharat / entertainment

రెండు చిత్రాలు హిట్​- ఆపై చేసినవన్నీ ఫ్లాప్​- అయినా కెరీర్​లో సక్సెస్ ఆ నటి ఎవరంటే? - twinkle khanna career graph

Twinkle Khanna Cine Career : ఆ నటికి బాలీవుడ్​లో మంచి బ్యాక్​గ్రౌండ్​ ఉంది. అంతే కాకుండా ఆమె నటించిన తొలి చిత్రం సూపర్ హిట్, రెండో చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇంకేంటి ఇండస్ట్రీలో టాప్​ హీరోయిన్​గా స్థిరపడుతుంది అనుకున్నారంతా. కానీ ఆ తరువాత వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాప్​. ఇంకేంటి చేసేదేమీ లేక ఏకంగా సినిమా కెరీర్​కే గుడ్​బై చెప్పేసింది. ఇంతకీ ఎవరా నటి అని తెలుసుకోవాలని ఉందా.

Twinkle Khanna Cine Career
Twinkle Khanna Cine Career
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 10:48 PM IST

Twinkle Khanna Cine Career: ట్వింకిల్​ ఖన్నా బాలీవుడ్​లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సూపర్​ స్టార్​ రాజేశ్​ ఖన్నా, డింపుల్​ కపాడియా గారాల కూతురు. 1996లో 'బర్సాత్​' అనే బాలీవుడ్​ చిత్రంతో ఇండస్ట్రీృలోకి ప్రవేశించిన ట్వింకిల్​, తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించింది. అంతేకాదు ఆ సినిమాకు ఉత్తమనటిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు సైతం అందుకుంది. ఇది ఆమె కెరీర్​లో నటించిన తొలి చిత్రానికి వచ్చిన మొదటి అవార్డు కూడా. దీంతో ఇండస్ట్రీ అంతా ఈమె మంచి నటిగా గుర్తింపు పొందుతుందనుకున్నారు. అయితే తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆమె నిరాశ చెందింది. ఇక చేసేదేమిలేక నటనకు స్వస్తి పలికింది. ప్రస్తుతం తనకు నచ్చిన రంగంలో స్థిరపడి బాగా రాణిస్తోంది.

1974లో రాజేశ్​ ఖన్నా, డింపుల్ కపాడియా దంపతులకు జన్మించిన ట్వింకిల్​ ఖన్నా తొలుత నటనపై ఆసక్తి చూపలేదు. 'చార్టర్డ్​ అకౌంటెంట్​'గా స్థిరపడాలనుకుంది. అయితే తన తల్లిదండ్రుల ఒత్తిడితో యాక్టింగ్​ ఫీల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. 1995లో బాబీ దేవోల్​ సరసన 'బర్సాత్' అనే చిత్రంలో తొలిసారి నటించింది. ఆ చిత్రం ఇండస్ట్రీ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి ఆరు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అనంతరం బాలీవుడ్​ అగ్ర హీరో అజయ్​ దేవగన్​ సరసన 'జాన్​' అనే మరో చిత్రంలో నటించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తెలుగులో వెంకటేశ్​తో
చేసిన రెండు సినిమాలూ విజయం సాధించడం వల్ల మంచి జోష్​లో ఉన్న ట్వింకిల్​ ఖన్నా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది. సైఫ్​ అలీ ఖాన్​తో కలిసి నటించిన 'దిల్​ తేరా దివానా' బిగెస్ట్​ ఫ్లాప్​గా నిలిచింది. అనంతరం బాలీవుడ్​లోని ప్రముఖ హీరోలైన షారుఖ్​ ఖాన్​,సల్మాన్​​ ఖాన్​, ఆమిర్​ ఖాన్​తో కలిసి పలు సినిమాల్లో నటించింది. ఇలా చేసిన ప్రతి మూవీ బాక్సాఫీస్​ వద్ద డిజాస్టర్​గా నిలవడం వల్ల తీవ్ర నిరాశకు గురైంది ట్వింకిల్​ ఖన్నా. ఇక 1999లో తెలుగులో టాలీవుడ్​ హీరో విక్టరీ వెంకటేశ్​ సరసన 'శ్రీను' అనే చిత్రంలో నటించింది. చివరగా 2000 సంవత్సరంలో వచ్చిన 'మేళా' అనే చిత్రంలో యాక్ట్​ చేసింది ఈమె. ఇదీ సైతం ఫ్లాప్​ అవడం వల్ల తన యాక్టింగ్​ కెరీర్​కు వీడ్కోలు పలికింది.

సక్సెస్​ఫుల్​ విమెన్​గా!​
బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్​తో ప్రేమాయణం నడిపిన ట్వింకిల్​ 2001లో ఆయన్ను వివాహం చేసుకుంది. 'ఇంటర్నేషనల్​ కిలాడీ', 'జుల్మీ' చిత్రాల సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ట్వింకిల్​​ ఖన్నా మంచి రచయితగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇంటీరియర్ డిజైనర్​గా, ప్రొడ్యూసర్​గా తన కెరీర్​ను కొనసాగిస్తోంది. ఈ రంగాల్లో సక్సెస్​పుల్​గా దూసుకుపోతూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఈమె ఆస్తుల విలువ రూ.274 కోట్లు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర' రిలీజ్​ పోస్ట్​పోన్​ ? - రేసులోకి ఆ రెండు టాలీవుడ్​ మూవీస్​!

ఓటీటీలోనూ తగ్గని 'సలార్​' జోరు- రిలీజైన 5 రోజులకే టాప్​ 10లో స్ట్రీమింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.