Gangs Of Godavari Twitter Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్- నేహాశెట్టి కాంబోలో తెరకెక్కిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించారు. ప్రముఖ సినీ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే?
శుక్రవారం ఉదయాన్నే కొన్ని థియేటర్లలో మూవీ ప్రీమియర్స్ షోస్ పడ్డాయి. హీరో విశ్వక్ వాయిస్‌తోనే సినిమా ప్రారంభమవుతుందట. లంక గ్రామాల్లో వైలెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడే యువకుడి పాత్రలో విశ్వక్ కనిపించారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని టాక్. ఇంటర్వెల్ సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక విశ్వక్ బోల్డ్ డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయమని ఓ నెటిజన్ అన్నారు.
'ఫస్ట్ హాఫ్ బాగుంది. స్టోరీ కొత్త దేమీ కాకపోయినా, డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగుంది. కథను లాగ్ చేయలేదు. అస్సలు బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ సినిమా సక్సెస్‌లో కీలప పాత్ర పోషించనుంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. '45 నిమిషాలు మూవీ చూశాను. రత్న క్యారెక్టర్ బాగుంది. మాస్, కామెడీ, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఆడు మొదటి మూడు పోట్లు అమ్మోరుకి వదిలేశాడు అయ్యా' అనే డైలాగ్, ఇంటర్వెల్ సీన్ సూపర్ అని ఇంకో ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. కాకపోతే రొటీన్ స్టోరీ, ఎడిటింగ్ కాస్త సినిమాకు నెగిటివ్ అయ్యిందని అంటున్నారు.
ఇక రత్న పాత్రలో విశ్వక్ అదరగొట్టారని, ఈ సినిమాతో ఆయనలోని మరో కోణాన్ని చూస్తారని చెబుతున్నారు. 'బుజ్జి' పాత్రలో హీరోయిన్ నేహాశెట్టి అచ్చం పల్లెటూరి తెలుగమ్మాయిలా చేసిందని ప్రశంసిస్తున్నారు. హైపర్ ఆది కామెడి టైమింగ్‌ను మెచ్చుకుంటున్నారు. కాకపోతే సినిమాలో అనుకున్నంత స్థాయిలో మాస్ యాక్షన్ సీన్స్ లేవని, విశ్వక్ స్టైల్ మిస్ అవుతామని అంటున్నారు. ఇక అక్కడక్కడా కొన్ని నెటిగివ్స్ మినహా మొత్తానికి సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది!
బాలయ్య సీట్ దగ్గర మద్యం సీసా - అసలు విషయం చెప్పిన నిర్మాత నాగవంశీ - Viswak Sen Gangs Of Godavari