ETV Bharat / entertainment

చనిపోయే ముందు హీరోయిన్ సౌందర్య చివరి మాటలు ఇవే - ఏం చెప్పారంటే? - Tollywood Actress Soundarya - TOLLYWOOD ACTRESS SOUNDARYA

Tollywood Actress Soundarya Death Anniversary : సినీ పరిశ్రమలో కొందరి లోటు తీర్చలేనిది, మరువలేనిది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చక్కటి పాత్రలతో అలరించిన అలనాటి నటి సౌందర్య. అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈమె ఈ లోకాన్ని వదిలి నేటికి సరిగ్గా 20 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఆమె చనిపోయే ముందు రోజు చివరిగా అన్న మాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 6:40 PM IST

Tollywood Actress Soundarya Death Anniversary : కట్టు, బొట్టు, నిండైన రూపంతో పాటు ఏ పాత్ర తీసుకున్నా అందులో ఒదిగిపోయే గుణం సౌందర్య సొంతం. ఆమె మరణించి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇంకా ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నారు. "మనవరాలి పెళ్లి" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సౌందర్య దశాబ్ద కాలం పాటు వెండితెరను తిరుగులేకుండా ఏలారు అనడంలో అతిశయోక్తి లేదు. అందాల ఆరబోత లేకుండా, అస్లీలత జోలికి పోకుండా కేవలం ఆమె నటనతోనే ప్రతి ఒక్కరినీ మెప్పించి శభాష్ అనిపించుకునారు. "శివకుమార్" అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన సౌందర్య అనుకోని ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సమయంలో ఆమె సోదరుడు కూడా ఆమెతో పాటే ఉన్నారు. పైగా అప్పటికే ఆమె రెండు నెలల గర్భవతి కూడా. కాస్త సంపాదిస్తేనే స్వార్థం చూసుకునే ఈ రోజుల్లో అంత స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ తనతో పాటు తన కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకునేవారట సౌందర్య. ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు కూడా తన మేనకోడలికి ఫోన్ చేసి మాట్లాడారంట. ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే సౌందర్య, చివరి మాటల్లోనూ చీరల గురించే ప్రస్తావించారట. తనకు కొన్ని కాటన్ చీరలు కావాలని, వాటితో పాటు కుంకుమ కూడా కావాలని మేనకోడలితో చెప్పారట.

అలానే కెరీర్ స్టార్టింగ్‌లో తనకు అవకాశం కల్పించిన వాళ్లను కూడా సౌందర్య చివరి వరకూ మరిచిపోలేదట. తనను చిత్రసీమకు పరిచయం చేసిన తమిళ డైరక్టర్ ఆర్వీ ఉదయ్ కుమార్‌తో, ఆయన భార్యతో మాట్లాడుతుండేవారట. చనిపోవడానికి రెండ్రోజుల ముందు కూడా ఫోన్ చేసి తాను గర్భవతిని అయ్యానని, ఎలక్షన్ అయిపోయాక వచ్చి కలుస్తానని వాళ్లతో చెప్పారట. ఈ విషయాన్ని ఉదయ్​ కుమార్ స్వయంగా తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సౌందర్య. భౌతికంగా దూరమైనా నిండైన రూపంతో ఆమె నటించిన సినిమాలలో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు.

గ్లామర్ డోస్ పెంచేసిన సమంత - ఆ స్టార్ హీరోతో కలిసి అలా! - Samantha Citadel Webseries

ఈ టాలీవుడ్​ చిన్నారి ఎవరో కనిపెట్టగలరా - ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ నటి! - Tollywood Star Anchor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.