ETV Bharat / entertainment

రాజమౌళితో సినిమా చేయాలని ఉంది : 'కల్కి' మూవీ ప్రొడ్యూసర్ - Ashwini Dutt Rajamouli Movie - ASHWINI DUTT RAJAMOULI MOVIE

Ashwini Dutt Rajamouli Movie : దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయాలని ఉందంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు.

Ashwini Dutt Rajamouli Movie
Ashwini Dutt Rajamouli Movie (Source : ETV Bharat (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 4:39 PM IST

Updated : Sep 29, 2024, 6:59 PM IST

Ashwini Dutt Rajamouli Movie : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ రీసెంట్​గా 'కల్కి 2898 ఏడీ' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని చెప్పారు. 'రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్‌ నం 1' సినిమాకు నేను ప్రజంటర్‌గా వ్యవహరించా. అది తొలి చిత్రమే అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ చేయాలని ఉంది' అని అశ్వనీదత్‌ తెలిపారు.

కాగా, పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న రిలీజై బ్లాస్​బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు వరల్డ్​వైడ్​గా రూ. 1150కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం తాను ఎలాంటి షరతులు పెట్టలేదని అన్నారు.

Kalki OTT : బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'కల్కి' గతనెల ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్లాక్​బస్టర్ మూవీ ఆగస్టు 22 అర్ధరాత్రి నుంచి నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్​ఫ్లిక్స్​లో హిందీ వెర్షన్​, అమెజాన్​లో తెలుగుతోపాటు సౌత్​ భాషల్లో అందుబాటులో ఉంది. అటు ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ దక్కించుకుంది.

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్​తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ప్రభాస్​తోపాటు సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. బీటౌన్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉండనుంది. అందులో భాగంగా నాగ్‌ అశ్విన్‌, ఆయన టీమ్‌ ప్రస్తుతం పార్ట్‌- 2 స్క్రిప్ట్‌ను పూర్తి చేసేపనిలో ఉంది.

OTTలోకి 'కల్కి' ట్రిమ్ వెర్షన్- 6 నిమిషాలు కట్- ఏ సీన్లు కత్తిరించారంటే? - Kalki 2898 AD OTT

చిరు నటించిన ఆ రెండ్ బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​! : అనౌన్స్ చేసిన అశ్వినీ దత్​ - Chiranjeevi Hit Movie Sequel

Last Updated : Sep 29, 2024, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.