Sunny Leone Police Constiable: సన్నీ లియోని ఈ పేరు తెలియని యంగ్‌స్టర్స్ దాదాపు ఉండరు. పోర్న్ స్టార్ అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్ నటిగా మారింది. అనంతరం తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు హాల్ టికెట్ కూడా వచ్చింది. అదేంటి కోట్లు సంపాదించే సన్నీ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును. ప్రస్తుతం హిందీ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సన్నీ లియోని వివరాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఈ చర్చనీయాంశకు కారణమైంది.
అసలేం జరిగిందంటే? యూపీ ప్రభుత్వం రీసెంట్గా పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఈ మధ్యే విడుదలయ్యాయి. ఆ హాల్ టికెట్స్‌లో ఒకటి సన్నీ పేరుతో వెలుగులోకి వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ హాల్‌టికెట్ ప్రకారం తిర్వా జిల్లా కనౌజ్‌లోని శ్రీమతి సోనే శ్రీ స్మారక గర్ల్స్ కాలేజ్‌లో సన్నీకి ఎగ్జామ్ సెంటర్‌గా పడింది.
దీంతో ఎవరో ఆకతాయి ఈ పని చేసి ఉంటారని భావించిన పోలీసులు దీన్ని దర్యాప్తు చేశారు. ఈ పని ఎవరు చేశారో గుర్తించారు. ఈ సంఘటన వల్ల యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కర్నాటకలో ఓసారి ఇలాంటి సంఘటనే జరిగింది. కర్నాటక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఓ నోటిఫికేషన్ రాగా, అందులోనూ సన్నీ లియోని వివరాలు బయటకు వచ్చాయి. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలానే ఇప్పుడు కూడా జరిగింది.
అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై భారీగానే స్పందిస్తున్నారు. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇది ఫేక్ కాబట్టి సరిపోయింది, ఒకవేళ నిజంగానే సన్నీ లియోని పోలీస్ అయితే మాత్రం ఎంతమంది కావాలని అరెస్ట్ అయ్యేవాళ్లో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్ బాక్సాఫీస్ ఫైట్!
ట్రెండింగ్‌గా యంగ్ లయన్ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ - చూస్తే కాలర్ ఎగరేయాల్సిందే!