Sundeep Kishan Raayan : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తమిళంలోనూ వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు. ఇటీవలే ఆయన కెప్టెన్ మిల్లర్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకోగా, 'రాయన్'తో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ధనుశ్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జులై 25) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయన తన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే
‘తమిళంలో నేను ఇప్పటివరకూ తొమ్మిది సినిమాల్లో నటించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో నేను ఏం చేయాలనుకున్నా కూడా ఛోటా కె.నాయుడు మేనల్లుడు కావడం వల్లే ఛాన్స్‌లు వస్తున్నాయని కొంతమంది మాట్లాడుకునేవారు. ఇతర భాషల్లో అయితే ఇటువంటి లెక్కలు రావు కదా అని, హిందీ, తమిళంలో చేశా. అప్పుడు కూడా ఇతడు మళ్లీ తమిళంలోనే చేస్తున్నాడంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే మళ్లీ తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చాను. 'కెప్టెన్ మిల్లర్' వరకూ తమిళంలో ఏ సినిమాలోనూ నటించలేదు.
అయితే ఆ సినిమా తర్వాత ధనుశ్ నాకు ఫోన్ చేసి 'రాయన్' గురించి చెప్పారు. డిఫరెంట్ రోల్ అది. పైగా ధనుశ్కు ఇది 50వ సినిమా. నా కోసం రాసుకున్న పాత్ర ఇది, నువ్వు చేయాలి అంటూ ధనుశ్ నాతో అన్నారు. అది విని మరో మాటకు అనకుండానే ఓకే చెప్పాను. తన కోసం అనుకున్న రోల్‌ను నాకు ఇచ్చారంటే అది నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంస అని అనుకున్నా. ఎమోషన్స్ యాక్షన్‌తో పాటు, కామెడీ యాంగిల్ ఉండేలా ఈ పాత్రను రూపొందించారు. ఇంతకుమించి నేను ఆ పాత్ర గురించి రివీల్ చేయలేను. అంటూ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.
ఇక సందీప్ కిషన్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవలే 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అంతకుముందు ధనుశ్ లీడ్ రోల్లో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశారు. అందులో తన పాత్రకు ప్రశంసలు కూడా పొందారు.
'మొండితనాన్ని ఆయుధంగా మార్చుకునే ఓ సామాన్యూడు' - మాయావన్ టీజర్ చూశారా? - Sundeep Kishan Mayaone