SSMB 29 Mahesh Babu Dual role : ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రాండ్ స్కేల్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం వల్ల అందరూ దృష్టి దీనిపైనే ఉంది. హాలీవుడ్ వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ చిత్రం గురించి గ్యాప్ లేకుండా రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. అలా తాజాగా ఓ సూపర్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మహేశ్ ఈ చిత్రంలో డ్యుయెల్ రోల్ చేయబోతున్నారని తెలిసింది. దీంతో ఫ్యాన్స్ అందరిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే మహేశ్ ద్విపాత్రాభినయం చేసి చాలా ఏళ్లు అయిపోయింది. ఆయన హీరోగా ఇప్పటివరకు డ్యుయెల్ రోల్ చేయలేదు. చిన్నవయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొడుకు దిద్దిన కాపురంలో డబుల్ యాక్షన్ చేశారు. మరోవైపు రాజమౌళి కూడా విక్రమార్కుడు, బాహుబలిలో తన హీరోల చేత ద్విపాత్రాభినయం చేయించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే SSMB 29లో మహేశ్ డ్యుయెల్ రోల్‌పై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Rajamouli Mahesh babu Movie Budget : ఇకపోతే ఇండియన్ సినిమానే చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ SSMB 29లో ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగునుందని, మూవీ పలువురు వీదేశీ నటులు కూడా నటించబోతున్నట్లు అంటున్నారు. ఈ చిత్రాన్ని సరికొత్త అధునాతన టెక్నాలజీతో తెరకెక్కించేందుకు ఏకంగా రూ.1000కోట్ల బడ్జెట్ పెడుతున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. సినిమాకు మహారాజ్(Mahesh Babu Rajamouli Movie title Maharaj) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ చిత్రంలో ఇండోనేషియాకు చెందిన ఓ హీరోయిన్ను తీసుకోబోతున్నారట. మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారట. ఆయన కోసం ఇప్పటికే 8 లుక్స్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది.
వార్ 2 : 100 రోజులు - రూ.100 కోట్లు!
'అసూయ, బాధతో చెబుతున్నా' - ఆ కొత్త హీరోయిన్‌కు ఫిదా అయిపోయిన జక్కన్న!