ETV Bharat / entertainment

నా ఫస్ట్​ లవ్​ గురించి ఆ సినిమాలో చూపించా - ఆమెను అలా అడిగేసరికి ఫీల్ అయ్యింది : రాజమౌళి - THE RANA DAGGUBATI SHOW

'ది రానా దగ్గుబాటి షో' లో ఎస్ఎస్ రాజమౌళి - ఇంట్రెస్టింగ్​గా రానా - జక్కన్న ఇంటర్వ్యూ

SS Rajamouli
SS Rajamouli (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

SS Rajamouli The Rana Daggubati Show : టాలీవుడ్ స్టార్ హీరో రానా తాజాగా హోస్ట్​గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షోకి స్టార్ డైరెక్టర్ రాజమౌళి వచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షోలో ఆయన తన సినిమా అలాగే పర్సనల్ విషయాలు గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే

వాళ్ల కోసం సినిమాలను షార్ట్ చేయాలి
ఒకే రకమైన ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ ఒక చోట కలిసేలా ఏదైనా వేదిక ఉండాలి. అటువంటి వేదికకు పేరు పెట్టాలంటే 'కనెక్ట్‌' అని పెడతాను. ఇక సినిమాల విషయానికొస్తే ఆడియెన్స్​కు దాని పట్ల ఇంట్రెస్ట్ ఉండేలా క్రియేట్‌ చేయాలి. ఇప్పటి తరంలో వందల కొద్దీ పేజీలున్న పుస్తకాలు చదవాలంటే ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపరు. అందుకోసం వాళ్లకే ఈ షార్ట్‌ వెర్షన్‌ అందించాలి. అది నచ్చితే ఇక పూర్తి పుస్తకాన్ని వాళ్లు చదువుతారు. 15 నిమిషాల్లో పుస్తకంలో ఉన్న సమాచారాన్ని చెప్పాలి. ఒకసారి మా ఇంట్లో పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను పాత సినిమా పెడితే వాళ్లు 'వద్దు బాబోయ్‌' అని అన్నారు. అయితే నేను కోప్పడి వాళ్లను కూర్చోబెట్టాను. 20 నిమిషాల తర్వాత అందరికీ సినిమా నచ్చడం మొదలుపెట్టింది. అందుకే పాత సినిమాలను కూడా ఇలా షార్ట్‌ చేసి, నేటి తరానికి అందించాలి. ఒక వేళ వాళ్లకు నచ్చితే పూర్తి మూవీ చేస్తారు.

ఆయన అంటే చాలా అభిమానం
నేను సినిమా రంగంలోకి రావడానికి ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందానో చెప్పటం చాలా కష్టం. కానీ నిద్రలోకి వెళ్లేటప్పుడు సరిగ్గా ఏ పాయింట్‌లో మనకు నిద్ర పట్టిందో చెప్పటం కూడా కష్టమే. అలాగే, నేను ఎలా స్ఫూర్తి పొందానో నాకే తెలియదు. చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, మా ఫ్యామిలీలోని వ్యక్తుల మధ్య జరిగిన చర్చలు అవన్నీ ఒక లావాల ఏర్పడి ఉండవచ్చు. ముఖ్యంగా నాకు సీనియర్‌ ఎన్​టీఆర్​ అంటే ఎంతో అభిమానం. ఆయన సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. ఓ నటుడిగానే కాదు ఓ డైరెక్టర్​గానూ ఆయనంటే ఇష్టం. ఆయన తన ఆలోచన విధానంతో ఎన్నో కొత్త దారులు వేశారు. చాలా మందికి ఆయన నటుడిగానే గుర్తుంటారు తప్ప, ఆయనలో గొప్ప డైరెక్టర్ కూడా ఉన్నారు. పురాణాలపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉంది. దానిని అందరూ చూసే విధంగా మార్చగలనన్న నమ్మకం, అలాగే ధైర్యం కూడా ఆయనలో ఉన్నాయి. అందుకే అన్ని గొప్ప సినిమాలు తీశారు. అలాగే, నాపై ప్రభావం చూపినవాళ్లలో వర్ఘీస్‌ కురియన్‌, లాల్‌ బహదూర్‌శాస్త్రి ఉన్నారు

అది ఆల్​టైమ్ ఫేవరెట్
మీ అందరికీ యాక్షన్‌తో ఉన్న సినిమాలను అందించే నాకు మాత్రం 'మిస్సమ్మ' లాంటి క్లాసిక్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో చాలా రొమాంటిసిజమ్‌ ఉంటుంది. చిన్నప్పుడు కొవ్వూరు లైబ్రరీలో అమర చిత్ర కథలను బాగా చదివేవాడిని. నా స్టోరీల్లో ఎక్కువగా ప్రతీకారాన్ని చూపిస్తాను. అదొక బలమైన భావోద్వేగం. అన్యాయం జరిగినప్పుడల్లా, దానికి న్యాయం జరగకపోతే కోపం, బాధ, అవమానం కలుగుతాయి. అవన్నీ చాలా బలమైనవి. నేను, మా నాన్న కూర్చొన్నప్పుడు తండ్రీ కొడుకులమన్న విషయం మాకు అస్సలు గుర్తుండదు. ఓ రచయిత, ఓ డైరెక్టర్ అన్నట్లుగానే మా ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. మా అబ్బాయి కార్తికేయతోనూ నేను అలాగే ఉంటా. తనొక ప్రొడ్యూసర్‌. నేనొక డైరెక్టర్. కానీ ఇంటికి వస్తే మాత్రం మామూలుగానే ఉంటాం.

నా ఫస్ట్‌ లవ్‌ ఆ సినిమాలో ఉంది
మనం చూసిన ఘటనలు, సొంత అనుభవాలు సినిమాల్లోనూ ఉంటాయి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్‌లో ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. కానీ తనతో మాట్లాడాలంటే ఎందుకో భయం. అయితే తనను నేను ఇష్టపడుతున్నానని మా క్లాసులో అబ్బాయిలందరికీ బాగా తెలుసు. ఇదే విషయమై నన్ను బాగా ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమెతో నేను మాట్లాడాను. అది కూడా చాలా కష్టం మీద. నా ముందు బెంచీలో కూర్చొనే ఆ అమ్మాయితో ఒక రోజు 'భారతి నువ్వు ట్యూషన్ ఫీజ్ కట్టావా' అని అడిగాను. దానికి ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరును నేను ఇప్పటికీ మర్చిపోలేను. 'భారతీ అని నేను పిలవగానే 'నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని చూస్తున్నాను' అన్నట్లుగా ఆమె నన్ను చూసింది. అయితే అప్పుడు నేను 'ట్యూషన్‌ ఫీజు కట్టావా' అని అడిగే సరికి ఆమె ముఖంలో తెలియని ఓ నిరాశ కనిపించింది. పిలిచింది ఇది అడగటానికా? అన్నట్లుగా చూసి తల ఊపి అటువైపు తిరిగిపోయింది. ఆ ఎక్స్​ప్రెషన్స్​ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. 'ఈగ'లో నాని, సమంత మధ్య ఇటువంటి సీన్సే ఉంటాయి. చాలా మంది డైరెక్టర్లు ఇలాగే తమ అనుభవాలను తెరపై తీసుకొస్తారు

'అప్పుడు బన్నీతో అలా చెప్పా - కానీ ఇప్పుడు అవసరం లేదు' : రాజమౌళి

'SSMB' షూటింగ్ లొకేషన్ కోసం జక్కన్న సెర్చింగ్! - వైరల్ అవుతున్న ఇన్​స్టా పోస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.