SS Rajamouli Eega Movie : స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఐకానిక్ సినిమాల్లో 'ఈగ' ఒకటి. అప్పటివరకు జక్కన్న సినిమాల్లో హీరో చుట్టూ కథ తిరుగుతూ ఉండేది, అయితే ఇందులో మాత్రం విన్నూత్నంగా ఆయన ఈగను హీరోగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ హాఫ్‌లో నాని కనిపించినప్పటికీ, సెకెండాఫ్‌లో ఈగ క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఈగ రూపంలో వచ్చిన నాని విలన్‌ను ఎలా మట్టుకరిపిస్తాడన్నడే ఈగ స్టోరీ. ఈ రివెంజ్ డ్రామాకు మన తెలుగు ప్రేక్షకులే కాదు మిగిలిన దక్షిణ భాషల ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. నార్త్‌లోనూ మక్కీగా హిందీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.
అయితే ఓ ఈగను సాధారణంగా కంటే దానిలోని పలు షేడ్స్‌ను చూపించారు డైరెక్టర్ రాజమౌళి. ఒకేలా కనిపించే ఈగ తనలోని ఎమోషన్స్‌ను చూపించి ప్రేక్షకులను అలరిస్తుంది. మనం ఇంట్లో చూసే ఈగ ఇలా కూడా ఉంటుందా అంటూ అందరూ ముక్కున వేలు వేసుకునేలా చేశారు రాజమౌళి. అయితే ఈగ అలా మనకి తెరపై కనిపించడానికి కారణం దాని వెనక ఆ చిత్ర బృందం పడిన శ్రమ. ఓ ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈగ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
"నేను రాజమౌళితో మగధీర, బాహుబలి రెండు భాగాలు, ఆర్ ఆర్ ఆర్ చేశాను కానీ వీటన్నిటి కన్నా ఈగ సినిమాకు చాలా కష్టపడ్డాను. రిఫరెన్స్ కోసం హాలీవుడ్ సినిమా బగ్స్ లైఫ్ చూశాను. మూవీ మేకింగ్ మొదలు కాకముందే ఈగల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మేము కొన్ని ఈగలను పట్టుకున్నాం. వాటి మీద రకరకాల ప్రయోగాల ద్వారా అవి చల్లని వాతావరణంలో 2 నుంచి 3 నిమిషాలు సృహ కోల్పోతాయని తెలుసుకున్నాం. మేము వాటిని మైక్రో ఫోటోగ్రఫీలో చూసినప్పుడు అందవికారంగా కనిపించాయి. కానీ ఈ ఇందులో మనుషుల కన్నా ఈగ హైలైట్ అవ్వాలి అదే నాకు పెద్ద ఛాలెంజ్" అని ఈగ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తన అనుభవాలను చెప్పారు.
ఈ మూవీ హీరో నాని కూడా కూడా తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. " అప్పటి టెక్నాలజీతో అలాంటి అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి. ఇప్పుడు ఉన్న అడ్వాన్సడ్ టెక్నాలజీతో ఇంకెంత బాగా తీసేవారో ఊహించండి. ఈ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయితే ప్రేక్షకులు అప్పటికన్నా పెద్ద హిట్ చేసేవారు" అని అన్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ లో నిర్మించారు. 2012లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">