ETV Bharat / entertainment

రోషన్ కొత్త సినిమా షురూ- డైరెక్టర్ ఎవరంటే? - Roshan Champion Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 9:18 PM IST

Roshan Champion Movie: యంగ్ హీరో రోషన్ తదుపరి చిత్రం 'ఛాంపియన్' ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది.

Roshan Champion Movie
Roshan Champion Movie (Source: ETV Bharat)

Roshan Champion Movie: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ తదుపరి చిత్రం 'ఛాంపియన్' ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం అధికారికంగా ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పూజా కార్యక్రమానికి హాజరై ఫస్ట్​ క్లాప్​ కొట్టారు. కాగా, ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్​పై ప్రొడ్యూసర్ స్వప్న దత్ నిర్మిస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయితే గతేడాది రోషన్ బర్త్ డై సందర్భంగానే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం ఇప్పటివరకూ అవుతూ వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. అయితే ప్రస్తుతానికి హీరో తప్పా మిగతా నటీనటుల వివరాలు మేకర్స్ వెల్లడించలేదు.

బ్లాక్​బస్టర్ వెబ్​సిరీస్ రైటర్
అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ అద్వైతం ఇదివరకు పలు సినిమాలకు రైటర్​గా పనిచేశారు. ఇటీవల తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న 'సేవ్ ది టైగర్స్​' వెబ్ సిరీస్​కు ప్రదీప్ రైటర్​గా చేశారు. అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ప్రియ దర్శి ఈ వెబ్​ సరీస్​లో నటించారు. రెండు సీజన్​లుగా రిలీజైన ఈ సిరీస్​కు తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

కాగా, 2016లో 'నిర్మలా కాన్వెంట్' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు మిక్స్​డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఈ సినిమాకుగాను రోషన్ బెస్ట్ మేల్ డెబ్యూట్ అవార్డు అందుకున్నాడు. అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మించారు. ఇక 2021లో తెరకెక్కిన 'పెళ్లి సందడి' సినిమాతో రోషన్ దాదాపు ఐదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రంతోనే శ్రీలీల వెండితెరకు పరిచయమైంది.

బెంగళూరు రేవ్​ పార్టీపై స్పందించిన నటీనటులు శ్రీకాంత్​, హేమ - Actor Hema Reacts on Rave Party

'కోటబొమ్మాళి పీఎస్' టీజర్ ఔట్ - సస్పెన్స్ థ్రిల్లర్​తో శ్రీకాంత్ కమ్​బ్యాక్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.