ETV Bharat / entertainment

'నా కూతురు పెళ్లా? నాకేం చెప్పలేదే' రూమర్స్​పై సోనాక్షి తండ్రి కామెంట్స్ - Sonakshi Sinha Marriage - SONAKSHI SINHA MARRIAGE

Sonakshi Sinha Marriage Rumors : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటుదనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్​పై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా స్పందించారు.

Sonakshi Sinha Marriage Rumors
Sonakshi Sinha Marriage Rumors (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 5:28 PM IST

Sonakshi Sinha Marriage Rumors : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. తనకన్నా వయసులో రెండేళ్లు చిన్నవాడైన నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహాం చేసుకోనుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్​పై సోనాక్షి సిన్హా తండ్రి, ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ పెళ్లి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

'బారాత్​లో డాన్స్​ చేయడానికి రెడీగా ఉన్నా'
'సోనాక్షి వివాహం చేసుకోనుందని సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ విషయం గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం మీడియాకు కూడా తెలుసని, మీ కూతురి వివాహం గురించి మీకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నాకు తెలికుండా మీడియాకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించుకుంటాను. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే నా సోనాక్షి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే, బారాత్‌లో డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా. మొత్తంగా నేను చెప్పేది ఒక్కటే ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల అనుమతి కోరడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు అంతే. ఆ సమయం కోసం వేచి చూస్తున్నాం. సోనాక్షి నిర్ణయంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే నిజమైతే ఆ జంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా' అని శతృఘ్న సిన్హా తెలిపారు.

జూన్​ 23న పెళ్లి?
అయితే 2020 నుంచి సోనాక్షి, జహీర్ కొన్నేళ్ల నుంచి డేటింగ్‌లో ఉంటున్నారని వదంతులు వచ్చాయి. జూన్‌ 23న వీరిద్దరూ పెళ్లి అని, అది కూడా దగ్గరి, ఇరు కుటుంబాల సమక్షంలో జరుగుతుందని వార్తలు వచ్చాయి. ముంబయిలో జరగనున్న ఈ వివాహానికి ఇప్పటికే హీరామండి చిత్ర బృందం సహా పలువురు సన్నిహితులు, ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శతృఘ్న సిన్హా తాజాగా స్పందించారు.

'ఆత్మవిశ్వాసం కలిగిన మహిళగా కనిపిస్తా - నా కెరీర్​లో ఇదే బెస్ట్ మూవీ' - INDIAN 2

ఐఏఎస్‌ పదవి వదిలి చేసి సినిమాల్లోకి ఎంట్రీ - తొలి చిత్రం ఏమైందంటే? - Musical School Director Debut Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.