ETV Bharat / entertainment

సన్​షైన్​, ట్రావెల్ పార్ట్నర్ - సితారకు మహేశ్ నమ్రత స్పెషల్ విషెస్! - Sitara Ghattamaneni Birthday

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 11:22 AM IST

Sitara Ghattamaneni Birthday : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు కుమార్తె సితార బర్త్​డే సందర్బంగా ఆమె తల్లిదండ్రులు మహేశ్​ బాబు, నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విష్ చేశారు.

Sitara Ghattamaneni Birthday
Sitara Ghattamaneni Birthday (Getty Images)

Sitara Ghattamaneni Birthday : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు కుమార్తె సితార బర్త్​డే సందర్బంగా ఆమె తండ్రి మహేశ్​ బాబు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. సితార లేటెస్ట్ ఫొటో షేర్ చేసి 'హ్యాపీ 12 మై సన్‌షైన్‌' అని పేర్కొన్నారు.

ఇక సితార తల్లి నమ్రత శిరోద్కర్ కూడా ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలతో పాటు కొన్ని స్పెషల్ వీడియోలతో ఆ వీడియోను ఎంతో క్రియేటివ్​గా ఎడిట్ చేశారు. "నా చిట్టి ట్రావెల్​ పార్ట్నర్​కి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు నువ్వు ఎప్పుడూ నాకు ఓ ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను నేను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌" అని నమ్రత తన కుమార్తె కోసం ఓ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

ఈ రెండూ పోస్ట్​లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వగా, మహేశ్ అభిమానులు, నెటిజన్లు సితారు బర్త్​డే విషెస్ తెలుపుతున్నారు. ఆ పోస్ట్​లను మరింత వైరల్ చేస్తున్నారు.

ఇక సితార విషయానికి వస్తే, మహేశ్ బాబు గారాలపట్టి అయిన ఈ చిన్నారి తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది. ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించగా, ఆ యాడ్ ద్వారా తనకు వచ్చిన పారితోషకాన్ని సామాజిక సేవల కోసం ఉపయోగించింది.

అయితే తనకు నటి కావాలని ఉందని, అవకాశం వస్తే ఫ్యూచర్​లో తప్పకుండా నటన వైపు వస్తానంటూ అప్పట్లో ఓ సారి తెలిపింది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ డ్యాన్స్ రీల్స్ అలాగే స్పెషల్ ఫొటోస్​ను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే డ్యాన్స్‌లోనూ శిక్షణ కూడా తీసుకుంటోంది. మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'సర్కారు వారి పాట' సినిమాలో పైసా అంటూ సాగే సాంగ్​ ద్వారా స్క్రీన్​పై మెరిసింది. అందులో తన ఎనర్జిటిక్ స్టెప్పులకుగానూ ప్రశంసలు అందుకుంది.

సితార ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకే- మహేశ్​, నమ్రత అస్సలు స్ట్రిక్ట్ కారట! - Sitara Ghattamaneni Favourites

మహేశ్​ కుమార్తె మంచి మనసు - అనాథలతో 'గుంటూరు కారం' చూసిన సితార

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.