Sapta Sagaralu Dhaati Side B OTT : భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అందులో ఇటీవలే విడుదలైన 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా మూవీ లవర్స్‌కు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన 'సైడ్ ఏ'కి సీక్వెల్ వచ్చిన ఈ మూవీ అటు స్టోరీతో పాటు ఇటు నటీనటుల యాక్షన్‌తో మంచి టాక్ అందుకుంది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నెటిజన్లు ఎంతగానో ఎదురచూస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ విడుదలై రెండు నెలలు అవుతోందని ఇంకెప్పుడు వస్తూందో అంటూ నిరీక్షిస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్డేట్ను మూవీ హీరో ఇచ్చారు.
ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుందని, త్వరలోనే ఈ మూవీ స్ట్రీమ్ కానుందని ఆయన తెలిపారు.
" సప్త సాగరాలు దాటి సైడ్‍బీ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. దీని రిలీజ్ డేట్ ఖరారు చేశాక ప్రకటిస్తాం" అంటూ రక్షిత్ శెట్టి ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చారు. మరోవైపు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ జనవరి లాస్ట్ వీక్‌లో లేదా ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లోనే స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
Sapta Sagaralu Dhaati Side B Cast : సప్తసాగరాలు దాటి సైడ్-బీ మూవీలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ లీడ్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వీరితో పాటు చైత్ర జే ఆచార్, రమేశ్ ఇందిర, అచ్యుత్ కుమార్, జేపీ తుమినాడ్, గోపాల్ కృష్ణ పాండే తదితరులు కీలకపాత్రలు పోషించి మెప్పించారు. తొలి పార్ట్‌ను తెరకెక్కించిన హేమంత్ రావు ఈ చిత్రాన్ని రూపొందించారు.
Sapta Sagaralu Dhaati Side-B Story : ప్రేమించుకుని ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి చివరికి విధి ముందు ఓడిపోతుంది మను, ప్రియ జంట. దీంతో ప్రియకు వేరే వ్యక్తితో పెళ్లవుతుంది. అయితే మను జైలులోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇదంతా తొలి భాగంలో జరిగిన కథే. అయితే పదేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత 2021లో మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి రావడం వల్ల రెండో భాగం కథ మొదలవుతుంది. బయటికి రాగానే ప్రియ (రుక్మిణీ వసంత్) అడ్రెస్ తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకోసం సురభి (చైత్ర జె.ఆచార్) సహాయం తీసుకుంటాడు. మరి ప్రియని మను కలిశాడా లేదా? పదేళ్ల తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? ఇంతకీ సురభి ఎవరు? తను జైలులో మగ్గిపోవడానికి కారణమైన వాళ్లపై మను ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఈ అంశాలన్ని సినిమాలో చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">