Vettaiyan VS Kanguva Release Date : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వేట్టయాన్. టి.జె.జ్ఞానవేల్ రాజా దీనిని తెరకెక్కిస్తున్నారు. రజనీ 170వ సినిమాగా ఇది రాబోతుంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్స్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ ప్రకటించింది.
వేట్టయాన్(Vettaiyan Release Date) అక్టోబర్ 10న మీ ముందుకు రానుంది అని లైకా ప్రొడక్షన్స్ పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలోని రజనీ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. ఇతర నటీ నటులకు సంబంధించిన కొన్ని సీన్స్ షూటింగ్ జరుపుకుంటోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారాలతో క్రైమ్ యాక్షన్ డ్రామాగా దీని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఈ మధ్య రానా మాట్లాడుతూ - వేట్టయాన్ రజనీకాంత్ స్టైల్, ఇమేజ్ సినిమా కాదని చెప్పారు. ఆయన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Witness the King’s fury, now in Telugu👑🗡️#KanguvaTrailer - Telugu
— Studio Green (@StudioGreen2) August 13, 2024
▶️ https://t.co/8xM5rPCFhn
Watch the #KanguvaTrailer in other languages 🔽
Tamil https://t.co/YCqvFhd83K
Hindi https://t.co/Q817VzQ10U
Kannada https://t.co/rI0pxRBnDM
Malayalam https://t.co/T72JCEX3NK#Kanguva… pic.twitter.com/mE9qcd61mf
ఇక లైకా ప్రొడక్షన్స్ ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియాలో 'కంగువా' వర్సెస్ 'వేట్టయాన్' ఫైట్ మొదలైపోయింది. ఎందుకంటే శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న కంగువా (Kanguva Release Date) కూడా అక్టోబర్ 10వ తేదీనే రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీంతో ఇద్దరూ స్టార్ హీరోలు ఒకేసారి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మాములుగా ఉండదు అంటూ సినీ ప్రియులు అంటున్నారు. ఏదేమైనా ఒకేరోజు రావడం కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.
రీసెంట్గా కంగువా ప్రొడ్యూసర్ ఈ బాక్సాఫీస్ పోటీ గురించి మాట్లాడుతూ "కంగువా కంటెంట్ గురించి తెలీదు కాబట్టి మొదటి భాగంతో ఇతర సినిమా వాళ్లు పోటీ పడతారు. కానీ కంగువా 2తో అలా కాదు. ఎవరూ పోటీకి రాలేరు. ఈ విషయాన్ని ఎంతో నమ్మకంతో చెబుతున్నా. సినిమా కంటెంట్ అంత బలంగా ఉంటుంది’ అని చెప్పారు.
Target locked 🎯 VETTAIYAN 🕶️ is set to hunt in cinemas worldwide from OCTOBER 10th, 2024! 🗓️ Superstar 🌟 as Supercop! 🦅
— Lyca Productions (@LycaProductions) August 19, 2024
Releasing in Tamil, Telugu, Hindi & Kannada!#Vettaiyan 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/WJi2ZvpX8Z
OTTలో రాఖీ బంధం - ఈ తెలుగు సినిమాలన్నీ సూపర్ హిట్టే! - OTT RAKSHA BANDHAN Movies
ఈ వారం 17 సినిమాలు - మూవీ లవర్స్ దృష్టంతా ఆ మూడు సినిమాలపైనే! - This Week OTT Theatre Releases