ETV Bharat / entertainment

అప్పుడే నిర్ణయించుకున్నా అలా చేయకూడదని : రజనీకాంత్‌ - ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలామ్

Rajinikanth Lal Salaam : సూపర్ స్టార్​ రజనీకాంత్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా నటించిన చిత్రం 'లాల్‌ సలాం'. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్​లో రజనీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం అన్నారంటే?

అప్పుడే నిర్ణయించుకున్నా అలా చేయకూడదని : రజనీకాంత్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 6:25 AM IST

Rajinikanth Lal Salaam : సూపర్ స్టార్ రజనీకాంత్​ నటించిన కొత్త సినిమా 'లాల్‌ సలామ్‌'. ఈ చిత్రంతో మొయిద్దీన్‌ భాయ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో(ఫిబ్రవరి 9) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్​లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. తన కుమార్తె ఐశ్వర్య(Aishwarya Rajinikanth) డైరెక్ట్ ఈ చిత్రాన్ని తాను నిర్మించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు.

"ఐశ్వర్య టాలెంట్​ గురించి నాకు తెలుసు. అందుకే ఇలాంటి స్టోరీని సెలెక్ట్​ చేసుకున్నందుకు నేనేమి ఆశ్చర్యపోలేదు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దగ్గరికి వెళ్లకముందు ఐశ్వర్య కొంత మంది ప్రొడ్యూసర్స్​ను కలిసింది. సినిమాను ప్రొడ్యూస్​ చేసేందుకు తిరస్కరించారు. రజనీకాంతే ఎందుకు ఈ చిత్రాన్ని నిర్మించకూడదు? అని వాళ్లు అనుకుని ఉంటారు. ఇకపై నిర్మాతగా వ్యవహరించకూడదని 'బాబా' సినిమా అప్పుడే డిసైడ్ అయ్యాను. నా కూతురు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అందుకే కొంత మంది ప్రొడ్యూసర్ల పేర్లను ఆమెకు సూచించి, వెళ్లమని చెప్పాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్​ నుంచి ప్రేరణ పొందిన ఈ స్టోరీని వినేందుకు గంట సమయం కావాలని ఐశ్వర్య నన్ను అడిగింది. దీన్ని నేను కాదనలేకపోయాను. ఈ సినిమా నేషనల్​ అవార్డులను అందుకుంటుందని అంటూ కథ చెప్పడం ప్రారంభించింది. వెంటనే నేను వినకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవార్డుల కోసమే సినిమాలు చేయకూడదు. అలాగని నేను వాటికి వ్యతిరేకిని కాదు. ఆర్థికంగా కూడా మంచి రిజల్ట్​ పొందాలనుకుంటాను" అని రజనీ పేర్కొన్నారు.

Laal Salaam Vishnu Vishal : ఇకపోతే దాదాపు ఏడేళ్ల గ్యాప్​ తర్వాత ఐశ్వర్య మళ్లీ దర్శకత్వం వహించిన చిత్రమిది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రికెట్‌ అండ్​ యాక్షన్​ నేపథ్యంలో రూపొందింది. చిత్రంలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ గెస్ట్​ రోల్​లో నటించారు. ఇక రజనీకాంత్‌ వేట్టయాన్​లోనూ(Vettaiyan Movie) నటిస్తున్నారు. 'జై భీమ్‌' ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యాక లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

'విశ్వంభర' హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.