ETV Bharat / entertainment

డ్యాన్స్​లోనూ జక్కన్న పెర్ఫెక్షన్! రిహార్సల్స్​లో రాజమౌళి దంపతులు అదుర్స్ - Rajamouli Dance Practise - RAJAMOULI DANCE PRACTISE

Rajamouli Dance Practise : ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో డైరెక్టర్ రాజమౌళి తన సతీమణి రమతో కలిసి డ్యాన్స్​ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనలోని ఈ ట్యాలెంట్​ను చూసి అందరూ మెచ్చుకున్నారు. తాజాగా ఈ డ్యాన్స్​కు సంబంధించిన రిహార్సల్స్ వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. దాన్ని మీరు ఓ లుక్కేయండి.

Rajamouli Dance Practise
Rajamouli Dance Practise
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 11:08 AM IST

Updated : Apr 11, 2024, 12:07 PM IST

Rajamouli Dance Practise : స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అందరూ జక్కన్న అని ఊరికే పిలవరు. సినిమాలను తెరకెక్కించే విషయంలో నుంచి ఆయన చేసే అన్ని పనుల్లోనూ ఆయన ఎంతో పెర్ఫెక్షన్ చూపిస్తారు. అందుకే ఆయనకు ఆ ముద్దు పేరు వచ్చింది. వర్క్‌తో పాటు ఫ్యామిలీ లైఫ్​ను ఆయన చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంటుంటారు. షూటింగ్స్‌ సమయంలో స్ట్రిక్ట్​గా కనిపంచే ఆయన ఆఫ్​స్క్రీన్​లో ఎంతో సరదాగా కనిపిస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా తన ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటారు.

తాజాగా ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ ఈవెంట్​లో తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆయన అద్భుతంగా డ్యాన్స్​ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది చూసిన ఫ్యాన్స్ ' ఇన్నేళ్లు జక్కన్న ఈ ట్యాలెంట్​ను ఎక్కడ దాచుంచారు' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియో అంత క్లారిటీగా ఉండనప్పటికీ అది సోషల్ మీడియోలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో ఒకటి నెట్టిట సందడి చేస్తోంది.

అందులోరాజమౌళి-రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అంటూ తన సతీమణి చేయి పట్టుకుని ఎంతో గ్రేస్​తో డ్యాన్స్ వేశారు. ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆయన పెర్ఫెక్ట్​గా స్టెప్పులేసిన తీరు చూసి చేసే పని ఏదైనా రాజమౌళి సిన్సియర్​గా సక్సెస్​ఫుల్​గా చేస్తారంటూ కితాబులిస్తున్నారు. అంతే కాకుండా జక్కన్నలో ఈ యాంగిల్ ఎంతో క్యూట్​గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలా - వాస్తవానికి జక్కన్న దంపతులు వారి కుమారుడు ఎస్. ఎస్ కార్తికేయ వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా కలిసి స్టెప్పులేసింది. కానీ రాజమౌళి మాత్రం ఈ మధ్యలో ఓ సారి డ్యాన్స్ వేశారు. RRR సినిమాకు ఆస్కార్ వచ్చిన సందర్భంలో 'నాటు నాటు' హుక్ స్టెప్​ను రీ క్రియేట్ చేశారు. ఆ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది.

రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో? - Rajamouli Mahesh Babu Movie

చరణ్, సుక్కు మూవీ - ఆ ఐదు నిమిషాలు లీక్ చేసిన రాజమౌళి - Rajamouli RC 17

Last Updated : Apr 11, 2024, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.