Rahul Ravindran BCCI Head Coach : ప్రస్తుత బీసీసీఐ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ఆ స్థానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ అప్లికేషన్లను కాస్త ఓపెన్ గూగుల్ ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో ఇదే అదునుగా చేసుకుని పలువురు నెటిజన్లు సరదాగా ఈ ఫార్మ్స్‌ను ఫిల్ చేసి ఆ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో బీసీసీఐకి తలనొప్పి వచ్చినంత పని అయ్యింది. కొన్ని వందల అప్లికేషన్లు రావడం వల్ల ఆ సంస్థ ఒక్కసారిగా కన్ఫ్యూజన్ అయిపోయింది.
అయితే నెటిజన్లు లాగే టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో కూడా బీసీసీఐ హెడ్ కోచ్ పదవీకి దరఖాస్తు చేసుకున్నారు. తాను అప్లై చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ అప్లికేషన్‌ను బీసీసీఐ యాక్సెప్ట్ చేయలేదని వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
టాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాహల్ రవీంద్రన్ ఇటీవలే బీసీసీఐ హెడ్ కోచ్ పొజిషన్ కోసం అప్లై చేశారు. అయితే ఆ ఫార్మ్ మొత్తం నింపాక ఈ ఫార్మ్‌ను మేము స్వీకరించలేము అంటూ మెసేజ్ వచ్చింది. ఇకే ఇదే విషయాన్ని స్క్రీన్‌షాట్ తీశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఫామ్ నింపడం సరదాగా ఉంటుందని నేను అనుకున్నాను. "మీకు తెలుసా, నేను ఒకసారి టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ కావాలని అనుకున్నాను" అని ఏదో ఒక రోజు నా పిల్లలకు చెప్పాలని అనుకున్నాను. కానీ" అంటూ క్యాప్షన్‌ను జోడించారు.
ఇక ఈ పోస్ట్‌ను చూసిన ఫ్యాన్స్ రాహుల్‌పై సరదగా మీమ్స్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. 'ఎప్పటికైనా మిమల్ని ఆ పొజిషన్లో చూస్తాం అన్న' అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
-
I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ
— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024
ఇక రాహుల్ రవీంద్రన్ సినిమాల విషయానికి వస్తే, 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాహుల్. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే దాని తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ అన్ని సపోర్టింగ్ రోల్సే కావడం గమనార్హం. దీంతో అటు సినిమాలు చేస్తూనే డైరెక్టర్‌గానూ పలు మంచి చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. 'చిలసౌ' సినిమాకుగానూ ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది.
ఇండియన్ సినిమాలో అత్యంత కాస్ట్లీగా 'రామాయణ్' - ఒక్క భాగానికే రూ.835కోట్లా? - Ramayan Movie
సినిమా రిలీజ్ ముందు గెటప్ శ్రీను ఊహించని డెసిషన్! - Jabardasth Getup Srinu