ETV Bharat / entertainment

'పుష్ప' సాంగ్ జోరు ఆగేదేలే- 3రోజుల్లోనే 50మిలియన్లు, లక్ష ఇన్​స్టా రీల్స్! - Pushpa 2 Records

Pushpa Pushpa Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' సినిమా నుంచి మేకర్స్ రీసెంట్​గా ఓ పాట రిలీజ్ చేశారు. రిలీజైన మూడు రోజుల్లోనే ఈపాట పలు రికార్డులు అందుకుంది.

Pushpa Pushpa song
Pushpa Pushpa song (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 6:21 PM IST

Updated : May 4, 2024, 6:27 PM IST

Pushpa Pushpa Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ కోసం యావత్ సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ రీసెంట్​గా సినిమా నుంచి 'పుష్ప పుష్ప' పేరిట ఫస్ట్ సింగిల్ (Song) రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ఆరు భాషల్లో రిలీజైన ఈ పాట యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

విడుదలైన మూడు రోజుల్లోనే ఆరు భాషల్లో కలిపి ఈపాట 50+ మిలియన్ వ్యూస్ దాటింది. ఈ క్రమంలో ఫాస్టెస్ట్​గా 50 మిలియన్ వ్యూస్​ సాధించిన పాటగా రికార్డ్ కొట్టింది. ఇదే సమయంలో దాదాపు 15 దేశాల్లో పుష్ప పుష్ప పాట ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ పాటపై ఇన్​స్టాగ్రామ్​లో నెటిజన్లు లక్షకుపైగా రీల్స్​ కూడా చేశారు. అంటే సోషల్ మీడియాలో పుష్ప హవా ఏ రేంజ్​లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాటకే ఈరేంజ్ రెస్పాన్స్​ లభిస్తే, ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక పుష్ప రాజ్ ఏ లెవల్​లో రికార్డులు తిరగరాస్తాడో!

ఊర మాస్​గా ఉన్న ఈ సాంగ్​ను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తన ట్యూన్​తో మరికాస్త ఎనర్జీటిక్​గా మలిచారు. 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సూపర్ లిరిక్స్​ను సాంగ్​కు అందించారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఇందులో పుష్పరాజ్‌ మ్యానరిజంను ఎంతో చక్కగా వివరించారు. ఇక సినిమా రిలీజ్​లోపు ఈ పాట 100 మిలియన్ క్లబ్​లోకి ఈజీగా చేరుతుంది.

ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందాన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి స్పెషల్ సాంగ్​లో ఎవరు చిందులేయనున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇప్పటికే విడుదల చేసిన రెండు స్పెషల్​ గ్లింప్స్​లు ఫ్యాన్స్​లో గూస్​బంప్స్ తెప్పించి సోషల్ మీడియాను షేక్ చేశాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆరు భాషల్లో 'పుష్ప పుష్ప' సాంగ్​ - ఎలా ఉందంటే ? - Pushpa 2 Title Song

నార్త్​లో 'పుష్ప' డామినేషన్- OTT, థియేట్రికల్​ రైట్స్​కే రూ.475 కోట్లు- ఇది సార్ ఐకాన్ స్టార్ బ్రాండు! - Pushpa 2 OTT Rights

Last Updated : May 4, 2024, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.