ETV Bharat / entertainment

'పుష్ప 2' వాయిదా కన్ఫామ్!​ - క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ టీమ్​ మెంబర్​ - Pushpa 2 Release Date Postponed - PUSHPA 2 RELEASE DATE POSTPONED

Pushpa 2 Release Date Postponed : పుష్ప 2 వాయిదా తప్పదని అల్లు అర్జున్ టీమ్​కు చెందిన ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Alluarjun (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 12:32 PM IST

Pushpa 2 Release Date Postponed : ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్​ నటించిన పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్​ 15 ఎప్పడెప్పుడు వస్తుందా, థియేటర్లకు ఎప్పుడు పరిగెడుదామా అని ఆతృతతో ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఈ చిత్రం వాయిదా పడిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఫ్యాన్స్​ కాస్త నిరాశ వ్యక్తం చేస్తూనే మరోసారి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంత వరకు మూవీటీమ్​ సరైన స్పష్టత ఇవ్వకుండా ఊరిస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 వాయిదా పడిందంటూ అల్లు అర్జున్​ టీమ్​కు చెందిన ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చారు. సినిమా అనుకున్న తేదీకి థియేటర్లలో వచ్చే అవకాశం లేదని శరత్​ చంద్ర నాయుడు అన్నారు. షూటింగ్ బ్యాలెన్స్​ చాలా ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాన్ని మూవీటీమ్​ మాత్రం తమ అధికార సోషల్ మీడియాలో అనౌన్స్ చేయలేదు. ఇక ఈ విషయాన్ని తెలుసుకుంటున్న అభిమానులు కొత్త రిలీజ్ డేట్​ కోసం వెయిట్ చేస్తున్నారు.

పుష్ప 2 వాయిదా గురించి ఇన్ని ప్రచారాలు సాగుతున్నప్పటికీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ప్రత్యేకంగా రిలీజ్​ డేట్​పై స్పందించలేదు. కానీ జూన్​ 16న పుష్ప 2లోని సెకండ్​ సాంగ్​ మిలియన్​ వ్యూస్​తో దూసుకెళ్తోందని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్​లో మాత్రం చివర్లో ఆగస్ట్​ 15నే సినిమా రాబోతున్నట్లు కనిపిస్తోంది.

దిపావళికి వచ్చే అవకాశం - సోషల్​ మీడియాలో పుష్ప 2 వాయిదా పడిందనే ప్రచారంతో పాటు దీపావళికి వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో తెలుగుతో పాటు హిందీ, తమిళం దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఆగస్ట్​ 15న రిలీజ్ చేసేలా కర్ఛీలు వెేస్తున్నారట. ఇప్పటికే పూరీ జగన్నాథ్​ - రామ్​ పోతినేని కాంబో డబుల్ ఇస్మార్ట్​ ఆగస్ట్ 15న రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా వచ్చేసింది. ఇకపోతే పుష్ప 2 విషయానికొస్తే అల్లు అర్జున్​తో పటు ఫహాద్ ఫాజిల్​, రష్మిక, సునీల్​, అనసూయ సహా పలువురు స్టార్ నటులు నటిస్తున్నారు.

'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కోసం ​రామ్​చరణ్ హీరోయిన్​

ఈ వారం 25 సినిమా/సిరీస్​లు - ఆ రెండు వెరీ స్పెషల్! - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.