Prithviraj Aadujeevitham The Goat Life 100 crores : 'సలార్' ఫేమ్ మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ నటించిన 'ఆడుజీవితం' రీసెంట్గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. అయితే తెలుగులో మాత్రం 'టిల్లు స్క్వేర్' జోరు ఎక్కువగా ఉండటం వల్ల ఆ చిత్రాన్ని ఇక్కడ ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ ఒరిజినల్ వెర్షన్లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుందని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా తమ చిత్రానికి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పృథ్వీరాజ్ సుకుమారన్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, ఈ చిత్రాన్ని మలయాళీ డైరెక్టర్ బ్లెస్సీ తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. బెన్నీ డానియల్ (బెన్యామిన్) గోట్ డేస్ అనే నవల రచించారు. దీనికి విశేష ఆదరణ దక్కింది. ఈ నవలనే బ్లెస్సీ 'ఆడుజీవితం' సినిమాగా తెరకెక్కించారు. దాదాపు 16 ఏళ్ల పాటు కష్టపడి మరీ దీన్ని తీర్చిదిద్దారు. దాదాపు రూ.82 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించారని సమాచారం. అలానే ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ కూడా ఎంతో కష్టపడ్డారు. కొన్ని సీన్స్ కోసం 31 కిలోల బరువు కూడా తగ్గారు. 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగారు.
కథేంటంటే ? నజీబ్ మహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉపాధి కోసం సౌదీ వెళ్తాడు. తన స్నేహితుడు హకీం (కేఆర్ గోకుల్)తో కలిసి అక్కడికి చేరుకుంటాడు. అయితే ఏజెంట్ వాళ్లను మోసం చేస్తాడు. దీంతో ఉద్యోగం దొరకక ఏం చేయాలతో దిక్కు తోచని పరిస్థితులోకి వెళ్లిపోతారు. అప్పుడు బలవంతంగా గొర్రెల్ని కాయడం కోసం ఓ యజమాని తీసుకెళ్తాడు. అలా వెళ్లిన ఇద్దరినీ వేర్వేరు చోట వదిలేస్తాడు. భాష తెలీదు. ఎడారి మధ్యలో సరైన తిండి ఉండదు. నీళ్లు దొరకదు. యజమానుల వేధింపులతో ఎన్నో కష్టాలు పడతారు నజీబ్. చివరగా అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి వెళ్లిపోవాలనుకని బయలుదేరుతారు. మరి నజీబ్ చివరికి వెళ్లి తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకున్నారా? లేదా అనేదే కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉత్కంఠగా సలార్ విలన్ కొత్త మూవీ ట్రైలర్ - ఇది పక్కా మరో మాస్టర్ పీస్!