ETV Bharat / entertainment

PVCUలోకి బాలయ్య వారసుడు- కిర్రాక్​గా మోక్షు ఫస్ట్ లుక్ - Mokshagna Teja Debut Movie - MOKSHAGNA TEJA DEBUT MOVIE

Mokshagna Teja Debut Movie : కొన్ని రోజులుగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Prasanth Varma Mokshagna
Prasanth Varma Mokshagna (Getty Images (Left), ETV Bharat (Right)t)
author img

By ETV Bharat Entertainment Team

Published : Sep 6, 2024, 10:44 AM IST

Mokshagna Teja Debut Movie : నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వారు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నటసింహం బాలకృష్ణ వారసుడి అరంగేట్రం ఫిక్స్ అయింది. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. 'సింబా ఈజ్‌ కమింగ్‌' అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్​ విషెస్‌ చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. 'నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది', 'వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం' అంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను షేర్ చేస్తూ తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకుగాను బాలకృష్ణకు డైరెక్టర్ ప్రశాంత్ థాంక్స్ చెప్పారు. ఇక ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ హీరోగా అలరించనున్నారు.

అయితే తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో దాదాపు 20 స్క్రిప్ట్‌లు రెడీ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలో చెప్పారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీయనున్నట్లు ఓ సందర్భంలో వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శుభాకాంక్షల వెల్లువ
బర్త్​ డే సందర్భంహా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞకు బర్త్​ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు NBK 109 సెట్స్​లో మోక్షజ్ఞతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆల్​ ది బెస్ట్ చెప్పారు. 'వీర సింహారెడ్డి'తో బ్లాక్ బస్టర్​ హిట్ ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేని కూడా విషెస్ చెప్పారు.

'సింబా'పై ప్రశాంత్ వర్మ మరో సూపర్ అప్డేట్‌ - నందమూరి ఫ్యాన్స్‌లో పెరిగిన జోష్‌ - Prasanth Varma Mokshagna

'సింబా ఈజ్ కమింగ్' - మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్! - Prasanth Varma Mokshagna Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.