ETV Bharat / entertainment

సందీప్ సూపర్ ప్లాన్! - 'స్పిరిట్​'లో ప్రభాస్ పోలీస్​గానే కాదు ఆ పాత్రలోనూ! - PRABHAS SPIRIT MOVIE

'స్పిరిట్​'లో పోలీస్ పాత్రతో పాటు మరో కీ రోల్ ప్లే చేయనున్న ప్రభాస్!

Prabhas Spirit Movie
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 8:49 AM IST

Prabhas Spirit Movie : రెబల్​ స్టార్ ప్రభాస్​, స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్​లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'స్పిరిట్'. యాక్షన్​ మోడ్​లో రూపొందనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు రూపర్స్ నెట్టింట ట్రెండ్ అవ్వగా, తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త ప్రభాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అదేంటంటే?

పోలీస్​ నుంచి మరో పాత్రకు!
'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారని డైరెక్టర్ సందీప్ వంగా తాజాగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్​లో ప్రభాస్ మెరవనున్నారని సినీ వర్గాల సమాచారం. తొలుత పోలీస్​గా ఉన్న ఆయన, స్టోరీలోని ట్విస్ట్​ల కారణంగా గ్యాంగ్​స్టర్​గా మారుతారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ వైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.

'స్పిరిట్​'లో మరో ఇద్దరు బడా హీరోలు!

ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రభాస్​తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలనూ సందీప్ వంగా తీసుకోబోతున్నారని తెలిసింది. వారు మరెవరో కాదు విజయ్ దేవరకొండ, రణ్​బీర్ కపూర్​. వీరిద్దరు కేమియో రోల్​ చేస్తారని సమాచారం అందింది. గతంలో వీరిద్దరితో సందీప్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' చేసి దర్శకుడిగా వెలుగులోకి వచ్చారు సందీప్ వంగా. ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో 'కబీర్ సింగ్'​గా తీసి బాలీవుడ్​లోనూ హిట్ అందుకున్నారు. ఇటీవలె రణ్​బీర్ కపూర్​తో వైలెన్స్​గా 'యానిమల్​​' తీసి భారీ బ్లాక్ బస్టర్​ను అందుకున్నారు. అలా తాను గతంలో చేసిన సినిమాల హీరోలను 'స్పిరిట్'​లోనూ చూపించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారట. అలానే స్పిరిట్​లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. ఇది తెలుసుకుంటున్న సినీ ప్రియులు, అభిమానులు సందీప్ రెడ్డి ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

ఇక స్పిరిట్ విషయానికి వస్తే, టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మొదటి నుంచి మూవీ టీమ్ చెబుతోంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రెడీ కానున్న ఈ చిత్రంతోనే ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించనున్నారు.

'స్పిరిట్' నుంచి నాలుగు అప్డేట్స్!​ - రంగంలోకి ఇద్దరు మెగాస్టార్స్​, ఓ బాలీవుడ్ హీరోయిన్

'స్పిరిట్'​ బడ్జెట్​పై లేటెస్ట్​ బజ్​ - ఏకంగా ఎన్ని వందల కోట్లంటే? - Spirit Movie Budget

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.