ETV Bharat / entertainment

'మీరు లేనిదే నేను లేను' - ప్రభాస్ స్వీట్ నోట్ విన్నారా? - Prabhas Special Thanks Video - PRABHAS SPECIAL THANKS VIDEO

Prabhas Special Thanks Video : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఫ్యాన్స్​కు థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. దాన్ని మీరూ చూసేయండి.

Prabhas Special Thanks Video
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 7:17 PM IST

Updated : Jul 14, 2024, 7:58 PM IST

Prabhas Special Thanks Video : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. అందులో ఆయన కల్కి సక్సెస్​ గురించి మాట్లాడి అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్​ తెలిపారు. 'మీరు లేనిదే నేను లేను' అంటూ పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లతో కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు మేకర్స్​ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

'స్వీట్‌ నోట్‌' అనే పేరుతో మూవీటీమ్ ఈ వీడియోను షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ స్వయంగా వచ్చి మనకు థ్యాంక్స్ చెప్పారంటూ సంబరాలు చేసుకున్నారు.

ఆర్​ఆర్​ఆర్​ను బీట్ చేసిన కల్కి
రీసెంట్​గా వరల్డ్​వైడ్​గా రూ.1000కోట్ల మార్క్ క్రాస్ చేసిన 'కల్కి 2898 AD' మూవీ తాజాగా మరో ఘనత సాధించింది. రిలీజైన మూడు వారాల్లోనే 'ఆర్ఆర్ఆర్' సినిమా హైదరాబాద్ ఫుల్​ రన్​ కలెక్షన్లను దాటేసి రికార్డుకెక్కేసింది.

హైదరాబాద్​ నేషనల్ మల్టీప్లెక్స్​లో 'ఆర్ఆర్ఆర్' ఫుల్ కలెక్షన్లు సుమారు రూ. 30.25 కోట్లు కాగా,​ ఇదే రీజన్​​లో 'కల్కి' ఇప్పటికే రూ. 33.50కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలా మూడు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ కంటే కల్కి దాదాపు రూ.3కోట్లు అధికంగా వసూళ్లు సాధించింది.

ఇక 'కల్కి' సినిమా విషయానికి వస్తే జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. సౌత్​లోనే కాకుండా నార్త్, ఓవర్సీస్ ఇలా విడుదలైన అన్ని చోట్ల అత్యథిక వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. దీంతో వచ్చే ఏడాదికల్లా 'కల్కి' సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట.

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన విజన్​తో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇందుకోసం ప్రత్యేకమైన వీఎఫ్ఎక్స్ నిపుణులను కూడా ప్రొడక్షన్ టీమ్​లోకి తీసుకున్నారు. ఇక ఈ చిత్రానికి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోరును అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణన్​కు కూడా మంచి మార్కులు పడ్డాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై నిర్మాత అశ్వనీదత్‌ ఈ మూవీని భారీ బడ్జెట్​తో రూపొందించారు.

నార్త్​లో ప్రభాస్ మార్క్ - రూ.250 కోట్ల మార్క్​కు చేరువలో 'కల్కి'

రూ.1000 కోట్ల క్లబ్​లోకి ప్రభాస్​ 'కల్కి'

Last Updated : Jul 14, 2024, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.