ETV Bharat / entertainment

ఆ దేశంలో రిలీజ్​కు సిద్ధమైన మన హీరోల సినిమాలు - ఇంతకీ అవేంటంటే? - Indian Movie Releases In Japan - INDIAN MOVIE RELEASES IN JAPAN

Indian Movie Releases In Japan : ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు సూపర్ హిట్ ఇండియన్ సినిమాలు అక్కడ రిలీజ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

source ETV Bharat and Getty Images
Indian Movie Releases In Japan (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 3:22 PM IST

Indian Movie Releases In Japan : ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమా ఒకటి రిలీజ్​కు రెడీ అయింది. ప్రభాస్​తో పాటు బాలీవుడ్ బాద్​ షా షారుక్​ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. ఇంతకీ ఆ చిత్రాలేంటంటే? ప్రశాంత్‌ నీల్ - ప్రభాస్ కాంబో సలార్‌, షారుక్‌ ఖాన్‌ - అట్లీ కాంబో జవాన్‌ అక్కడ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసుకుంది.

Salaar Japan Release : ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్​లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​కు చాలా కాలం తర్వాత దక్కిన హిట్​ సలార్. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.270 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.715 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడీ చిత్రం జులై 5న జపాన్‌లో రిలీజ్ కానుంది. గతంలో ప్రభాస్‌ నటించిన పలు చిత్రాలు అక్కడి మంచి రెస్పాన్స్​ను అందుకున్నాయి. అలానే మంచి కలెక్షన్స్‌ కూడా దక్కించుకున్నాయి. ఇప్పడు సలార్‌ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్​గా రిలీజైన జపాన్‌ సలార్​ రిలీజ్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

Sharukh Jawaan Japan Release : ఇక అక్కడ షారుక్‌ ఖాన్‌ అట్లీ దర్శకత్వంలో నటించిన జవాన్‌ కూడా నవంబర్‌ 29న రిలీజ్​కు రెడీ అవుతోంది. గతేడాది సెప్టెంబర్‌ 7న ఇండియాలో రిలీజైన ఈ చిత్రం రూ.1043 కోట్ల వరకు వసూలు చేసింది. బాలీవుడ్​లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఇందులో నయనతార, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు జపాన్‌లోనూ ఈ చిత్రం సెన్సేషనల్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. జులై 5న అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. చూడాలి మరి ఈ సినిమాలు అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో.

2025 కల్లా 'కల్కి 2' రిలీజ్​- షూటింగ్ ఎప్పుడంటే? - Kalki 2898 AD Sequel

వరు వెడ్స్​ నికోలాయ్​ - గ్రాండ్ రిసెప్షన్​లో సినీ తారల సందడి - Varalakshmi Sarathkumar Reception

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.