ETV Bharat / entertainment

బుజ్జి, భైరవ యానిమేటెడ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే? - Prabhas Kalki 2898 AD

Kalki 2898 AD Bujji And Bhairava : ప్రభాస్ కల్కి బుజ్జి అండ్‌ భైరవ యానిమేటెడ్‌ సిరీస్‌ అమెజాన్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎలా ఉందంటే?

Source ETV Bharat
Kalki 2898 AD Bujji And Bhairava (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 11:31 AM IST

Kalki 2898 AD Bujji And Bhairava : ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. జూన్‌ 27న విడుదల కానుందీ చిత్రం. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్​లో జోరు పెంచింది. ఇందులో భాగంగా సినిమాలో కీలకంగా వ్యవహించిన భైరవ(ప్రభాస్​) - బుజ్జి(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబోటిక్ కార్) ఎలా కలిశారన్న పాయింట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ యానిమేటెడ్​ సిరీస్​ను రూపొందించారు. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

కథేంటంటే ? కల్కి సినిమా జరిగే కాలానికి రెండేళ్ల ముందు అనగా 2896 ఏడీ ప్రపంచాన్ని ఇందులో చూపించారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా కార్గో వెహికల్‌లో పనిచేస్తుంటుంది ఏఐ మెషీన్‌ బుజ్జి. ఓ సందర్భంలో బుజ్జికి ప్రమోషన్‌ వస్తుంది. దీంతో కాంప్లెక్స్‌ మెంబర్‌ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్​గా మారడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడ రెబల్స్‌ అటాక్‌ చేసి షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్‌ సిటీతో కనెక్షన్‌ కట్‌ అయిపోతుంది. బుజ్జి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ నగరంలో భైరవ(ప్రభాస్​) సరదాగా తిరుగుతుంటాడు. దొంగలను, దోపిడీదారులను పట్టుకుని యూనిట్స్‌ (క్రిప్టో కరెన్సీలాంటిది) బాగా సంపాదించి, కాంప్లెక్స్‌ మెంబర్‌ అవ్వాలనుకుంటాడు. కానీ ఏ పని చేసినా అతడి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. పైగా ఇంటి యజమాని (బ్రహ్మానందం)కి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులో ఉంటాడు. అయితే దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్‌ ముక్కలైపోతుంది. దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు భైవర తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి కనెక్ట్ అవుతుంది. దీంతో బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్‌ కారును తయారు చేసేందుకు రెడీ అవుతాడు? మరి దాన్ని ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే కథ.

ఎలా ఉందంటే ? - సాధారణంగా ఇప్పటివరకు హిట్‌ అయిన సినిమాలకు కొనసాగింపుగా కామిక్స్‌, సిరీస్‌లు, బుక్స్‌ వచ్చాయి. కానీ కల్కి మాత్రం సినిమా రిలీజ్​కు ముందే యానిమేటెడ్​ సిరీస్​ను రిలీజ్​ చేశారు. భైరవ బుజ్జి పాత్రలను ప్రేక్షకులను మరింత బాగా కనెక్ట్ చేయడానికే ఇది చేశారు. కార్గో షిప్‌లో బుజ్జి, కాశీ నగరంలో భైరవ ఇలా రెండు పాత్రలు, వాటి స్వభావాలను మొదటి ఎపిసోడ్‌లో పరిచయం చేశారు మేకర్స్​. ఆ తర్వాత రెండో ఎపిసోడ్​లో ఇద్దరూ కలిసి ఏం చేశారన్నది చూపించారు. ప్రభాస్‌ భైరవ పాత్రకు యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ బాగుంది. ఇక బ్రహ్మానందం పాత్ర చెప్పే డైలాగ్‌లు బాగా నవ్వించాయి. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ సిరీస్‌ను బాగా చేసింది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. మూవీ థీమ్‌కు సరిపోయేలా పాత్రలను డిజైన్‌ చేశారు. కాశీని చూపించిన తీరు బాగుంది. బుజ్జి పాత్రకు కీర్తిసురేశ్‌ వాయిస్‌ కూడా సరిగ్గా సరిపోయింది. మరి బుజ్జి, భైరవ కలిసి తమ లక్ష్యాల కోసం ఏం చేశారన్నది కొనసాగిస్తారేమో చూడాలి.

ఎడారిలో మహేశ్​ బాబు కొడుకు - అక్కడ ఏం చేస్తున్నాడంటే? - Gautam Ghattamaneni

హీరోయిన్ ప్రణీత బాత్ టబ్ వీడియో - తిట్టిపోస్తున్న ఫ్యాన్స్​! - Pranitha Subhash

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.