ETV Bharat / entertainment

బీటౌన్​లో పూజ నయా జర్నీ - స్టార్ హీరో తనయుడితో మూవీ - Pooja Hegde Sanki Movie - POOJA HEGDE SANKI MOVIE

Pooja Hegde New Hindi Movie : గతకొంత కాలంగా సినిమాల్లో కనిపించని బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా ఓ ప్రతిష్టాత్మక సినిమాకు సైన్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టితో 'సంకీ' అనే సినిమాలో నటించనుంది. ఆ విశేషాలు మీ కోసం.

Pooja Hegde New Hindi Movie
Pooja Hegde New Hindi Movie (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 7:24 AM IST

Pooja Hegde New Hindi Movie : బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలంగా తన సినిమాల గురించి ఎటువంటి అప్​డేట్స్​ ఇవ్వలేదు. గతేడాది 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌' సినిమాలో మెరిసిన ఈ చిన్నది, ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా ఆమె మరో ప్రాజెక్ట్​కు సైన్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టితో కలిసి 'సంకీ' అనే సినిమాలో నటించనుంది.

అద్నాన్‌ షేక్‌, యాసిర్‌ ఝూ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్​ను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ జూన్​లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లవ్​ స్టోరీ బ్యాక్​డ్రాప్​లో రూపొందుతున్న ఈ సినిమాను బీటౌన్​ స్టార్ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ మూవీ విడుదలను ఖరారు చేశారు మేకర్స్.

"ఈ సినిమాతో పూజా హెగ్డే తన కొత్త జర్నీని ప్రారంభించనుంది. జాన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు కీలకమైన యాక్షన్‌ సీన్స్​ను తెరకెక్కించనున్నారు. దీని కోసం ముంబయిలో ఓ భారీ బడ్జెట్‌ సెట్‌ను కూడా సిద్ధం మూవీ టీమ్​. ఇందులో అహాన్‌, పూజ మధ్య కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనుంది" అంటూ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇక ఇక పూజా గతేడాది 'కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌' అనే సినిమాలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, వెంకటేశ్​ లాంటి స్టార్స్​తో కలిసి ఈ సినిమాలో మెరిసింది. భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయిది. ఆ తర్వాత 'గుంటూరు కారం'లోనూ పూజా నటించింది. కానీ ఆ సినిమా షూటింగ్​ నుంచి పూజా అనూహ్యంగా తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో శ్రీ లీల నటించింది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత పూజా మరే చిత్రాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు 'సంకీ'తో పాటు టాలీవుడ్​లో మరో సినిమాలోనూ పూజాకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

బుట్టబొమ్మ ఫ్యాన్స్​కు పండుగ - త్వరలో మరింత బిజీ కానున్న పూజ!

పాపం పూజా హెగ్డే - ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.