OTT Experimental Telugu Movies : ఎప్పుడు చూడు ఈ యాక్షన్ సినిమాలేనా? రొటీన్ లవ్ స్టోరీలేనా? ఏమైనా డిఫరెంట్‌గా లేవా అని అనుకునే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు తెరకెక్కాయి. అవి ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆడియోన్స్‌కు మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఏ ఓటీటీలో అవి అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
అతడెలా తప్పించుకున్నాడు? - డెజావు కాన్సెప్ట్‌తో దర్శకుడు అజయ్ నాగ్ తెరకెక్కించిన చిత్రం ఆరంభం. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించారు. జైలులో శిక్ష అనుభవించే ఖైదీ సడెన్‌గా మాయమైపోతాడు. వేసిన తాళం వేసినట్టే ఉంటుంది, ఊచలు, గోడలకు అలానే ఉంటాయి. కానీ అతడు మాత్రం ఎలా తప్పించుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అదృశ్య శక్తితో పోరాటం - సాధారణంగా సినిమాల్లో ఎవరైనా నట విశ్వరూపం చూపిస్తే వన్ మ్యాన్ షో అంటుంటాం కదా. మరి సినిమా మొత్తం ఒకే పాత్రధారితో తెరకెక్కితె? అలాంటి సినిమానే 105 మినిట్స్. హన్సిక ఒక్కరే చిత్రంలో నటించారు. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆరు రోజుల్లోనే చిత్రీకరించడం మరో విశేషం.
జాను (హన్సిక) నివాసం ఉంటున్న ఇంట్లో ఓ అదృశ్య శక్తి దాగి ఉంటుంది. తన మరణానికి హన్సికనే కారణమని ఆ అదృశ్య శక్తి ఆమెను రోజూ భయపెడుతుంది. మరి జాను ఆ శక్తి నుంచి ఎలా తప్పించుకుంది. ఇంట్లో నుంచి ఎలా బయటపడింది? అసలా ఆ వ్యక్తి మరణానికి హన్సిక ఎలా కారణమైంది? అన్నదే కథ. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
దెయ్యంతో ప్రేమ - మనుషుల్నే చెంపే ఓ దెయ్యాన్ని ప్రేమిస్తాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే అతడెలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అసలా దెయ్యం తిరిగి ప్రేమించిందా? లేదంటే అందరినీ చంపినట్టే అతడిని చంపేసిందా? అన్న కథే లవ్ మీ. ఆశిష్, వైష్ణవీ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ్ భీమవరపు తెరకెెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్‌లో - ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరో మమ్ముట్టి ఆ మధ్య భ్రమయుగం అనే బ్లాక్ అండ్ వైట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ సదాశివన్ దర్శకుడు. ఓ పాడుబడ్డ భవనంలోకి అనుకోకుండా వచ్చిన ఓ యువకుడు అక్కడ తాంత్రిక విద్యలు నేర్చిన మంత్రగాడి బారి నుంచి ఎలా బయటపడ్డాడన్నదే సినిమా కథ. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫేస్ బ్లైండ్‌నెస్ - ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్యను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి తన కళ్ల ముందు జరిగిన హత్య గురించి పోలీసులకు సమాచారమిస్తాడు. ఎవరి ముఖాన్ని, గొంతును గుర్తుపట్టలేని అతడు హత్యకు సంబంధించిన వివరాలు ఎలా చెప్పాడు? చివరికి ఆ కేసులో తనే ఎదుకు చిక్కుకోవాల్సిన వచ్చింది? ఎవరు ఇరికించారు? మరి దాన్ని నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే ప్రసన్న వదనం మిగితా కథ. ఇందులో ఫేస్ బ్లైండ్ నెస్ వ్యక్తిగా సుహాస్ నటించారు. ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
రజనీ, విజయ్ రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ 'కల్కి'
జానీ మాస్టర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రామ్‌చరణ్, ఉపాసన! - Ram Charan Upasana