Old Songs Remixed In Telugu Films : కొన్ని సార్లు పాత పాటలు ఎంతో వినసొంపుగా అనిపిస్తుంటాయి. అయితే ఆ సాంగ్స్‌ను ఇప్పటితరం వారి కోసం కొంత మంది డైరెక్టర్లు రీమేక్ చేసి హిట్స్ కొట్టారు. అప్పటి దంచవే మేనత్త కూతురా నుంచి బంగారు కోడిపెట్ట వరకు టాలీవుడ్లో రీమేక్ అయిన పలు రీమేక్ సాంగ్స్ గురించి ఓ లుక్కేద్దామా.
దంచవే మేనత్త కూతురా
'మంగమ్మ గారి మనవడు' సినిమా కోసం 1984లో నందమూరి బాలకృష్ణ, సుహాసిని కలిసి దంచవే మేనత్త కూతురా అనే సాంగ్ చేశారు. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ పాటను 2009లో రిలీజ్ అయిన 'రైడ్' సినిమాలో రిమేక్ చేశారు. ఆ తర్వాత తాజాగా వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాలోనూ ఈ సాంగ్‌ను రీమేక్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
1977లో రిలీజ్ అయిన 'అడవి రాముడు' సినిమాలోని ఈ పాటకు సీనియర్ ఎన్టీఆర్, జయపద్ర వేసిన స్టెప్పులు ఇప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఈ పాటను మళ్లీ 2004లో ప్రభాస్, ఆర్తీ అగర్వాల్ నటించిన 'అడవి రాముడు' సినిమా కోసం రిమేక్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వానా వానా వెల్లువాయే
చిరంజీవి గారి హిట్టు సినిమాల్లో ఒకటైన 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని పాట ఇది. 1991లో రెయిన్ సాంగ్ లా తెరకెక్కిన ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తమ డాన్స్ తో ఎక్కడికో తీసుకెళ్లారు. తిరిగి 2012లో 'రచ్చ' సినిమా కోసం రీమేక్ చేసిన ఈ పాటకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి రఫ్ఫాడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆకు చాటు పిందే తడిసే
1979లో అందాల తార శ్రీదేవీ, సీనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'వేటగాడు' సినిమాలోని పాట ఇది. తిరిగి 2002లో 'అల్లరి రాముడు' చిత్రం కోసం ఈ పాటను '2002 వరకూ చూడలేదే ఇంత సరుకు' అంటూ రిమేక్ చేశారు. రిమేక్ సాంగ్‌లో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఆర్తీ అగర్వాల్ కలిసి స్టెప్పులేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బంగారు కోడి పెట్ట
మెగాస్టార్ చిరంజీవి, నగ్మా కలిసి నటించిన 'ఘరానా మొగుడు' చిత్రంలోని పాట ఇది. 1992లో రిలీజ్ అయిన ఈ పాటను తిరిగి 2004లో రామ్ చరణ్ 'మగధీర' సినిమాలో రిమేక్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిన్ను రోడ్డు మీద చూసినాక
1993లో రిలీజ్ అయిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని ఈ పాటకు కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలిసి అదరగొట్టారు. తరువాత 2018లో ఈ పాటను 'సవ్యసాచి' సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య,నిధి అగర్వాల్ కలిసి స్టెప్పులేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆకాశంలో ఒక తార
సూపర్ స్టార్ కృష్ణ, జయప్రదల సూపర్ హిట్ సినిమా 'సింహాసనం' చిత్రంలో పాట ఇది. 1986లో ఈ పాట ఒక ఊపు ఊపిందనడంలో అతిశయెక్తి లేదు. తరువాత ఈ పాటను 2011లో రిలీజ్ అయిన 'సీమ టపాకాయ' సినిమాలో రీమేక్ చేశారు. రిమేక్ సాంగ్ లో అల్లరి నరేష్ తో పాటు పూర్ణ కలిసి స్టెప్పులేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శుభలేక రాసుకున్నా ఎదలో ఎపుడో
1990లో విడదలైన 'కొండవీటి దొంగ' సినిమాలోని హిట్ సాంగ్ ఇది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రాధ కలిసి చక్కటి రొమాన్స్ పండించారు. తరువాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ 2003లో 'నాయక్' సినిమాలో ఈ పాటను తిరిగి తెరమీదకు తీసుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గువ్వా గోరింకతో
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో ఒకటి 'ఖైదీ నెం.786'. ఇందులోని ఫేమస్ సాంగ్ గువ్వా గోరింకాకు చిరంజీవితో పాటు రాధ కూడా పోటీ పడి డ్యాన్స్ చేశారు. తరువాత 2015లో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో రీమేక్ చేసిన ఈ పాటలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజీనా కసాండ్రాలు సూపర్ అనిపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాలెంటైన్ వీక్ స్పెషల్- బెస్ట్ లవ్ ట్రాక్స్- ఈ సాంగ్స్ ఎప్పటికీ రిపీటెడ్ మోడ్‌లోనే!
2023లో ఈ పాటలదే హవా - వన్స్ మోర్ అంటున్న మ్యూజిక్ లవర్స్