ETV Bharat / entertainment

'మేనన్‌' నా ఇంటి పేరు కాదు' - అసలు విషయం చెప్పిన నిత్యా మేనన్ - Nithya Menen About Her Name - NITHYA MENEN ABOUT HER NAME

Nithya Menon Name Secret : ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైన నిత్యా మేనన్‌ తన ఇంటి పేరు వెనక ఉన్న అసలు విషయాన్ని చెప్పింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Nithya Menon (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 8:51 PM IST

Nithya Menon Name Secret : నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, సహజ నటనతో ఎంతో మంది కుర్రాళ్లను తన ఫ్యాన్స్​గా మార్చుకుంది. ప్రస్తుతం కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. రీసెంట్​గా ఆమె హీరో ధనుశ్​తో కలిసి చేసిన 'తిరుచిత్రాంబలం' చిత్రంలో నటనకుగానూ బెస్ట్ యాక్ట్రెస్​గా నేషనల్ అవార్డుకు కూడా ఎంపికైంది.

అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మేనన్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. 'మేనన్‌' అనేది తన ఇంటి పేరు కాదని, దాన్ని పెట్టుకోవడానికి ఓ కారణం ఉందని తెలిపింది. తన అసలు పేరు ఎన్‌ఎస్‌ నిత్య అని చెప్పింది.

తన తల్లిదండ్రుల పేర్లు నళిని, సుకుమార్‌ అని చెప్పిన నిత్యా మేనన్​, ఆ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని ఎన్​ఎస్​ అని పెట్టుకున్నట్లు తెలిపింది. తమ ఫ్యామిలీలో ఎవరూ ఇంటి పేరును వాడరని పేర్కొంది. ఎందుకంటే కులాన్ని పేర్లతో ముడిపెట్టడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.

నటిగా చాలా చోట్లకు ప్రయాణాలు చేయాల్సి వస్తుందని చెప్పిన నిత్యా, అందుకే పాస్‌పోర్ట్‌లో తన పేరుకు 'మేనన్‌' అని జత చేసినట్లు తెలిపింది. కేవలం న్యూమరాలజీ ఆధారంగానే తాను మేనన్‌ అని జత చేసినట్లు చెప్పింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తమ ఫ్యామిలీ మూడు తరాలుగా బెంగళూరులోనే ఉంటోందని చెప్పారు నిత్యా మేనన్‌ వెల్లడించారు. స్కూల్​లో తన సెకండ్‌ లాంగ్వేజ్‌గా కన్నడ చదివినట్లు వెల్లడించారు. చాలా మంది తనను మలయాళీ అనుకుంటారని, కానీ తాను బెంగళూరు వాసినేనని చెప్పారు నిత్యా మేనన్.

Nithya Menen Upcoming Movies : ఇక నిత్యా మేనన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇందులో విజయ్‌ సేతుపతి కూడా ఉన్నారు. అలాగే కోలీవుడ్ హీరో జయం రవితో కలిసి 'కాదలిక్క నేరమిల్లై' చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.

పరోటా మాస్టర్​గా స్టార్ హీరో - నిత్యా మేనన్ సినిమా కోసం! - Nithya Menon New Movie

హీరోయిన్​ రష్మికకు ప్రమాదం! - ఇప్పుడెలా ఉందంటే? - Heroine Rashmika Mandanna Injured

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.