NBK 109 Glimpse : నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ సూపర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా' అంటూ విలన్ అడగ్గా, "సింహం నక్కల మీదకొస్తే అది వార్ అవ్వదురా - ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ గ్లింప్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇక ఈ గ్లింప్స్‌లో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. తన ఫైటింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీతో పాటు ఫైట్ సీన్స్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చలు జరగుతున్నాయి. 'గ్లింప్సే ఇలా ఉంటే ఇక మూవీ ఏ రేంజ్లో ఉండనుందో' అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
NBK 109 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైనర్‌మెంట్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'యానిమల్' ఫేమ్ బాబీ దేఓల్ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నారు.
బాలయ్య ఓ ఆల్‌రౌండర్ - సీనియర్ నటి ప్రశంసల జల్లు
ఇటీవలే సీనియర్ నటి సిమ్రన్, బాలకృష్ణతో తన మూవీ జర్నీ గురించి మాట్లాడారు. ఓ ఫ్యాన్స్ అడిగిని ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
"బాలకృష్ణతో మీరు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారు కదా. మరీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపించింది." అంటూ ఫ్యాన్ అడగ్గా, ఆయన ఓ ఆల్‌రౌండర్, వైబ్రెంట్ ఎంటర్‌టైనర్! తన వైవిధ్యమైన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేసే విషయంలో ఏమాత్రం రాజీ పడరు" అంటూ సిమ్రన్ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇక బాలకృష్ణ- సిమ్రన్ కాంబినేషన్‌లో సమరసింహా రెడ్డి, గొప్పింటి అల్లుడు, నరసింహ నాయుడు, సీమ సింహం, లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
-
A vibrant entertainer who is also an all-rounder! Never leaves a chance to captivate the audience with his diverse talents. https://t.co/bYxtR1TM8v
— Simran (@SimranbaggaOffc) March 8, 2024
బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌కు బాలయ్య జై - ప్రభాస్‌తో కలిసి రూ.100కోట్ల బడ్జెట్ మూవీలో!
బాలయ్య కొత్త సినిమాకు చిరంజీవి స్పెషల్ విషెస్ - ఆనందంలో ఫ్యాన్స్!