ETV Bharat / entertainment

తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ - ఫొటోస్ చూశారా? - Balakrishna Mokshagna - BALAKRISHNA MOKSHAGNA

Balakrishna Mokshagna with Taraka Ratna children : బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరూ తారకరత్న ఫ్యామిలీని కలిశారు. పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. పూర్తి వివరాలు స్టోరీలో

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 4:00 PM IST

Updated : Apr 20, 2024, 4:15 PM IST

Balakrishna Mokshagna with Taraka Ratna children : నందమూరి తారకరత్న గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు ఎంతో బాధపడ్డారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే చాలా ఎక్కువగా బాధ పడ్డారు. తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ భాద్యతను బాలకృష్ణ చూసుకుంటున్నారని కూడా తెలిసింది. ఎప్పటికప్పుడు వారి బాగోగులు చూసుకుంటూ, అప్పుడప్పుడు కలుస్తూ, పలకరిస్తూ ఆ కుటుంబానికి తానున్న ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా బాలయ్య తారకరత్న ఫ్యామిలీని కలిశారు. ఈ సారి బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా తారకరత్న ఫ్యామిలీని కలిశారు.

తారకరత్న పిల్లలతో కలిసి బాలయ్య, మోక్షజ్ఞ ఫోటోలు కూడా దిగారు. ఆ పిక్స్​ను తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. "నేను ఏ వైపు ఉన్నానని నన్ను చాలా సార్లు అడుగుతూ వస్తున్నారు. నేను మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము" అంటూ బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ఫొటో, కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. మోక్షజ్ఞ, బాలయ్య, తారకరత్న ఫ్యామిలీని కలిసి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్​ బాగా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Balakrishna Upcoming Movies : ఇకపోతే బాలయ్య ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్​ దగ్గరపడడంతో ప్రచార సభల్లో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. ఇది పూర్తవ్వగానే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్​బీకే 109 సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పక్కా యాక్షన్ మోడ్​లో ఇది తెరకెక్కుతోంది. రీసెంట్​గా రిలీజైన గ్లింప్స్​ కూడా ఫ్యాన్స్​లో పూనకాలను తెప్పించింది. అనంతరం ఎన్​బీకే 110గా బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 చేస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై అఫీషియల్​ కన్ఫర్​మేషన్ ఇంకా రాలేదు.

వీకెండ్ స్పెషల్​ - టాప్ 10 ట్రెండింగ్​ సిరీస్​ ఇవే! మీరేం చూస్తారు? - Top 10 OTT Webseries

200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​! - Kurchi Madatha Petti Song

Last Updated : Apr 20, 2024, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.