Balakrishna Famous Dialogues: సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేయని ప్రయోగం లేదు. పౌరాణికం, జానపదం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్స్, పీరియాడిక్ డ్రామా, యాక్షన్ సినిమా ఇలా అన్నింటిలోనూ తన ప్రావీణ్యాన్ని కనబరిచి ఔరా అనిపించారు. తెలుగు సినీ పరిశ్రమలో డైలాగ్ చెప్పాలంటే అది బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా. 'దబిడి దిబిడే' అనే మాస్ డైలాగ్ నుంచి 'శరణమా రణమా' అనే రాజులు మాట్లాడే గ్రాంధికం వరకూ ఉతికారేశారు. వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత క్రేజ్‌ను పెంచుకున్న బాలయ్య అంటే చిన్నారుల నుంచి ముసలి వాళ్ల వరకూ అందుకే అంత మక్కువ.
స్పష్టమైన తెలుగులో ఇండస్ట్రీ మొత్తం మార్మోగేలా చేసిన ఆయన చెప్పిన డైలాగ్స్ మీ కోసం..
లెజెండ్
- ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్
నేను ఒకడికి ఎదురు వెళ్లినా వాడికే రిస్క్
తొక్కి పడేస్తా! - ఫ్లూటు జింక ముంగు ఊదు, సింహం ముందు కాదు!
డిక్టేటర్
- నేనేది మొదలుపెట్టను మొదలుపెడితే వదిలిపెట్టను
గౌతమీ పుత్ర శాతకర్ణి
- సమయం లేదు మిత్రమా- శరణమా? రణమా?
లయన్
- కొందరు కొడితే ఎక్స్‌రేలో కనబడుతుంది
ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది
నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది!
సింహా
- చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవ్ మాడిపోతావ్
ఊ కొడతారా ఉలిక్కి పడతారా
- ఈ రాయుడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడైనా కాపాడలేడు!
అదే ఈ రాయుడు కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్లలేడు!
లక్ష్మీ నరసింహ
- కుమార స్వామి, గోపాల స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి,
సీతారామ స్వామి, ఐదుగురు కొడుకులు పుట్టినట్టే పోతుంటే!
ఈ సారి పుట్టేవాడు, చంపేవాడు కావాలి గానీ చచ్చే వాడు కాకూడదని
మొక్కి మరీ పెట్టాడురా మా నాన్న నా పేరు 'లక్ష్మీ నరసింహ స్వామి' అని
చెన్నకేశవ రెడ్డి
- ఉష్! సౌండ్ చేయకు కంఠం కోసేస్తా
నరసింహ నాయుడు
- ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే
టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే
కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా!
సమరసింహా రెడ్డి
- నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా
నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికి వచ్చా
మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపై కనుంటే
మీ అబ్బ మొలతాడు కట్టి ఉంటే
నీ మూతి మీద ఉన్నది మొలిచిన మీసమే అయితే
నన్ను చంపరా రా!
వాస్తవానికి ఆయన చెప్పే ప్రతి మాట ఓ పవర్ డైలాగ్ లాంటిదే. వేరే వాళ్లు చెప్తే మాట అయితే ఆయన చెప్తే అది బుల్లెట్‌లా పేలే డైలాగ్. అందుకే అంటుంటారంతా జై బాలయ్య.
బాలయ్య డైలాగులను బట్టి ఏ సినిమాలోనివో కనిపెట్టగలరా?
- 'కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు'
- 'ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'
- 'నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పనిచేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు'
- 'నీకు బెయిల్ ఇప్పించింది దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు'
- 'నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే, షూటర్ ని కాల్చిపారేస్తా'
- 'నాకు ఎమోషన్స్ ఉండవ్, ఫీలింగ్స్ ఉండవ్, కాలిక్యులేషన్స్ ఉండవ్, మానిప్యులేషన్స్ ఉండవ్'
- 'సెంట్రల్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరు అయినా నేను దిగనంతవరకే'
'రోజుకో 'NTR' సినిమా- కబడ్డీ టీమ్ కెప్టెన్'- బాలయ్య లైఫ్‌స్టైల్! - Balakrishna 50 Years