ETV Bharat / entertainment

ఆ టైటిల్స్​తో మహేశ్​, ఎన్టీఆర్ వస్తారనుకుంటే - ఈ హీరోలొచ్చేశారు! - Movies With Same Title - MOVIES WITH SAME TITLE

ఒకే టైటిల్​లో రెండు మూడు సినిమాలు రావడం సహజమే. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల కొత్త సినిమాలకు ట్రెండ్​ అవుతున్న టైటిల్స్​తో ఇతర హీరోలు తమ సినిమాలను చకచకా రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో కాస్త కన్ఫ్యూజన్​ కూడా ఏర్పడింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
mahesh ntr (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 9:29 PM IST

మూవీ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్లకు వచ్చే హైప్‌ వేరే లెవల్లో ఉంటుంది. తమ ఫేవరెట్‌ హీరో, స్టార్‌ డైరెక్టర్‌ కాంబోలో వచ్చే మూవీలపై ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉంటాయి. మూవీకి ఏ టైటిల్‌ ఉంటే బాగుంటుందో కొన్నిసార్లు అభిమానులే నిర్ణయిస్తారు. లేదంటే ఆయా సినిమాకు ఈ టైటిల్​ ఖరారు చేయబోతున్నారంటూ ఏదో ఒక పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఓ సినిమాకి సంబంధించి వైరల్‌ అయిన టైటిల్‌తో మరో హీరో సినిమా వచ్చేస్తోంది. అలాంటి సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

డ్రాగన్‌గా రాబోతున్న ప్రదీప్‌ - ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ ఓ మూవీ చేయనున్నారు. ‘సలార్‌-2’ తర్వాత నీల్‌ తీయబోయే మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్​గా ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ‘డ్రాగన్‌’ అంటూ ట్రెండ్‌ అయింది. అయితే కొద్ది రోజులకే అదే టైటిల్‌తో తన సినిమాను ప్రకటించి డైరెక్టర్‌, యాక్టర్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ అందరికీ షాక్ ఇచ్చారు. అశ్వత్‌ మరిముత్తు ఈ మూవీకి డైరెక్ట్‌ చేయనున్నాడు. దీంతో ఎన్టీఆర్‌, నీల్‌ మూవీ టైటిల్‌ ట్రెండింగ్‌ ఆగిపోయింది.

కల్కి కన్‌ఫ్యూజన్‌ - ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం పేరు తెగ ట్రెండ్ అయింది. అయితే ఇప్పుడు ‘కల్కి’ పేరుతో మరో రెండు సినిమాలు ట్రెండింగ్‌లో వచ్చాయి. ఒకటి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ నటించని ‘కల్కి’ కాగా, మరొకటి మలయాళ హీరో టొవినో థామస్‌ నటించిన ‘కల్కి’. టొవినో థామస్‌ కల్కి మూవీ ప్రస్తుతం ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇలా ఒకే టైటిల్‌తో మూడు సినిమాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

మహారాజ్‌ మహేశ్‌ కాదు - మహేశ్‌బాబు హీరోగా, టాప్‌ డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్‌ జానర్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా లెవల్లో తీస్తున్న మూవీ కావడంతో అందరికీ సులభంగా చేరువయ్యేలా ‘మహారాజ్’ అనే పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటూ టాక్‌ వినిపించింది. మూవీ టీమ్‌ నుంచి అధికారిక సమాచారం లేకపోయినా దీనిపై సోషల్‌మీడియాలో బాగానే టాక్‌ నడిచింది. అయితే, ఇప్పుడు ఇదే టైటిల్‌తో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి వస్తున్నారు. ఆయన కెరీర్‌లో 50వ సినిమా తెరకెక్కిన ‘మహారాజ’ జూన్‌ 14న రిలీజ్‌కు సిద్ధమైంది. దీనికి నిథిలన్‌ దర్శకుడు. ఇటీవల రిలీజ్‌ అయిన ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది. మహేశ్‌బాబు మూవీ టైటిల్‌ అంటూ సాగిన ప్రచారానికి విజయ్‌ సేతుపతి మూవీతో ఫుల్‌స్టాప్‌ పడింది.

షాకింగ్​గా కమల్​ హాసన్​ లుక్​ - మాటల్లేవ్,​ గూస్​బంప్సే! - Prabhas Kalki 2898 AD Trailer

భారీ రేంజ్​లో 'కల్కి' యాక్షన్ ట్రైలర్ - ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రేంజ్​లో - Prabhas Kalki 2898 AD Trailer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.