Miss World 2024 Sini Shetty: ప్రతిష్ఠాత్మక 'మిస్ వరల్డ్ 2024' పోటీలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన 'ది టాప్ మోడల్' పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్- 2022 సినీశెట్టి పాల్గొన్నారు. ప్రముఖ డిజైనర్ రాఖీ స్టార్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ గౌను, లైట్ జ్యువెలరీ పోటీలో సనీశెట్టి ఆకర్షణీయంగా నిలిచారు. పోటీలో ఆమె ర్యాంప్‌పై హొయలొలికించారు.
ఆమె ట్రెండీ లుక్కు ఫ్యాషన్ ప్రియులతోపాటు కాంపిటీషన్ జడ్జ్‌లు కూడా అట్రాక్ట్ అయ్యారు. దీంతో అమె 'బెస్ట్ డిజైనర్ డ్రెస్ ఫ్రమ్ ఆసియా అండ్ ఓషియానియా'గా విజయం సొంతం చేసుకున్నారు. డిజైనర్ 'రాఖీ స్టార్ డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి పంచింది' అని సినీశెట్టి అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 28ఏళ్ల తర్వాత ఈ పోటీలకు భారత్ వేదికైంది. ఆయా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు. కిరీటాన్ని గెలవడమే లక్ష్యంగా అందాల భామలు పోటీలకు సిద్ధమవుతున్నారు. భారత్ నుంచి సినీశెట్టి ఈ పోటీలో పాల్గొంటున్నారు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకునేందుకు సినీశెట్టి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 18న మొదలైన ఈ పోటీలు మార్చి 9తో ముగియనున్నాయి. ఈ పోటీలకు దిల్లీ భారత్ మండపం, ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికలు అయ్యాయి. ఇటీవల జరిగిన ఓ పోటీలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ పాటకు ఆమె డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
ఆ ఘనత భారత్ కూడా సొంతం: ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు 'అధికారిక ఫ్యాషన్ డిజైనర్'గా ఆమెను ఎంపిక చేయడం వల్ల భారత్‌కు ఈ ఘనత కూడా దక్కింది. ఈ క్రమంలో పోటీల్లో పాల్గొనే 120 దేశాలకు చెందిన అందాల భామలకు ఆమె దుస్తులు రూపొందించనున్నారు. అయితే వాళ్ల శరీరాకృతి, అభిరుచుల్ని బట్టి ఆయా ఈవెంట్లకు దుస్తులు రూపొందించడమంటే మాటలు కాదు. అయినా దీన్నో సవాలుగా కాకుండా తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అర్చన అన్నారు.
28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు- ప్రత్యేకతలివే!
28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు- పూర్తి షెడ్యూల్ ఇదే