ETV Bharat / entertainment

'ఆ కామెంట్లను నమ్మొద్దు - మీర్జాపుర్ 3 సూపర్ హిట్' - Mirzapur 3

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 12:12 PM IST

Mirzapur 3 Vijay Varma : 'మీర్జాపుర్ 3' విడుదల సందర్భంగా బాలీవుడ్​ నటుడు విజయ్‌ వర్మ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇందులో నటించడంపై తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Mirzapur 3 Vijay Varma
Vijay Varma (Getty Images)

Mirzapur 3 Vijay Varma : తొలి రెండు సీజన్లతో విశేషాదరణ పొందిన 'మీర్జాపుర్' ఇప్పుడు మూడో సీజన్​తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రస్తుతం ఇది స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సిరీస్‌ గురించి ఇందులో కీలకపాత్ర పోషించిన బాలీవుడ్​ నటుడు విజయ్‌ వర్మ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇందులో నటించడంపై తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

"నేను మీర్జాపూర్‌కు పెద్ద ఫ్యాన్​ను. తొలి భాగాన్ని కేవలం ఓ ప్రేక్షకుడిగా చూసినప్పుడు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత ఏం జరుగుతుందో అంటూ అందరిలా నేను కూడా ఎదురుచూశాను. రెండో సీజన్‌ ఎప్పుడు వస్తుందో అని పలుమార్లు అనుకున్నాను. అయితే సీజన్‌ 2లో ఓ రోల్​ కోసం మేకర్స్‌ నన్ను సంప్రదించినప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిపోయాను. వెంటనే ఓకే చెప్పేశాను. 'మీర్జాపుర్​' మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్. ఇప్పటివరకు ఏ సిరీస్‌నూ చూడనంతమంది దీన్ని వీక్షించారు. ఎంతోమంది ప్రేమాభిమానాలను ఇది సొంతం చేసుకుంది. ఇందులో భాగమైనందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. క్రిటిక్స్ చేసే కామెంట్స్‌ను ఎవరూ పట్టించుకోవద్దు. 'మీర్జాపుర్​ 3'ను చూసి అందరూ మంచి అనుభూతి పొందండి" అంటూ నటుడు విజయ్‌ వర్మ వ్యాఖ్యానించారు.

'మీర్జాపుర్' సిరీస్​లను డైరెక్టర్ గుర్మీత్‌ సింగ్‌ తెరకెక్కించారు. తొలి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. అందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు పంకజ్‌ త్రిపాఠి తన నటనతో ఆకట్టుకోగా, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌, శ్వేతా త్రిపాఠి లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు. తొలి సిరీస్​కు వచ్చిన రెస్పాన్స్​తో దాదాపు రెండేళ్ల తర్వాత 2020 అక్టోబరు 23న రెండో సీజన్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇదీ కూడా ఆడియెన్స్​ దగ్గర బాగా క్లిక్ య్యింది. దీంతో నాలుగేళ్ల గ్యాప్​ తర్వాత 2024లో మూడో సీజన్​ను రిలీజ్ చేశారు. జులై 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

మీరు గుడ్డూ భయ్యా ఫ్యాన్సా? అయితే ఈ బెస్ట్ మూవీస్ మీ కోసమే! - Ali Fazal Movies

సింహాసనం కోసం గుడ్డూతో కాలీన్ భయ్యా పోరాటం - ఆసక్తికరంగా మీర్జాపుర్ 3 ట్రైలర్ - Mirzapur 3 Trailer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.