ETV Bharat / entertainment

ఫస్ట్ సినిమాతోనే ఫుల్ క్రేజ్- సల్మాన్​, షారుక్​తో హీరోయిన్​గా ఛాన్స్- ఆ ఒక్క కారణంతో కెరీర్ స్మాష్!

ఫస్ట్ సినిమాతోనే ఫుల్ క్రేజ్- సల్మాన్​, షారుక్​తో హీరోయిన్​గా ఛాన్స్- ఆ ఒక్క కారణంతో కెరీర్ స్మాష్! - ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారంటే?

MAMTA KULKARNI BOLLYWOOD JOURNEY
Actress (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

సినిమాల్లో చాలా మంది తమ కెరీర్​ను గొప్పగా ప్రారంభించినప్పటికీ కొంతకాలానికి తమ పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ ఫీల్డ్​కు దూరమవుతుండటం మనం చాలా సార్లు చూశాం. అలా వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఆకస్మికంగా కనుమరుగైపోయిన ఓ స్టార్ హీరోయిన్​ గురించే ఈ స్టోరీ. బీటౌన్​లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయిన ఈ స్టార్ ప్రస్తుతం అన్నింటికీ దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

90స్​లో బాలీవుడ్‌ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన హీరోయిన్లలో మమతా కులకర్ణి ఒకరు. అతి తక్కువ కాలంలోనే అద్భుత అవకాశాలు అందుకున్నారీ నటి. తన యాక్టింగ్​తో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 1992లో 'తిరంగా' అనే మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే టాప్‌ యాక్టర్‌లైన రాజ్ కుమార్, నానా పటేకర్‌తో కలిసి నటించారు. తన అందం, అభినయంతో అప్పట్లోనే చాలా మంది స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. సల్మాన్‌, అమీర్‌, షారుక్​తోనూ ఈమె స్క్రీన్​ షేర్ చేసుకున్నారు.

మమతా కులకర్ణి సూపర్‌హిట్ మూవీలు
మమతా కులకర్ణి తన కెరీర్‌లో అనేక సూపర్‌హిట్ మూవీలు తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆషిక్ ఆవారా' (1993), 'వక్త్ హమారా హై' (1993), 'క్రాంతి వీర్' (1994), 'కరణ్ అర్జున్' (1995), 'సబ్​సే బడా ఖిలాడి' (1995), 'ఆందోళన్' (1995), 'బాజీ' (1996), 'చైనా గేట్' (1998), 'చుపా రుస్తం : ఎ మ్యూజికల్ థ్రిల్లర్' (2001) ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం, వివాహం
మమతా కులకర్ణి వ్యక్తిగత జీవితం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 2013లో అంతర్జాతీయ డ్రగ్ లార్డ్‌గా ముద్రపడిన అహ్మదాబాద్‌లో జన్మించిన విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నారు. అయితే 'చైనా గేట్' విడుదల తర్వాత నిర్మాత రాజ్‌కుమార్ సంతోషికి ఆమెకు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇది ఆమె కెరీర్‌ను మరింత దెబ్బ తీసిందని బీటౌన్ వర్గాల మాట. దీని తర్వాత ఆమెకు అవకాశాలు లభించడం కష్టమైందని తెలుస్తోంది.

ఆధ్యాత్మికత వైపు అడుగులు
తన చుట్టూ ఉన్న వివాదాలు, ప్రతికూలతతో విసుగు చెంది, మమతా కులకర్ణి బాలీవుడ్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారట. సినిమాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా యోగినిగా జీవించడం ప్రారంభించారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం మమతా కులకర్ణి కెన్యాలో నివసిస్తున్నట్లు సమాచారం.

డైరెక్టర్​ బడ్జెట్ కష్టాలు- కారులోనే దుస్తులు మార్చుకున్న హీరోయిన్!

సినిమాల కోసం చదువుకు ఫుల్​స్టాప్​ పెట్టిన మహేశ్ హీరోయిన్ - ఇప్పుడు ఏం చేస్తోందంటే? - Actress Left Studies For Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.