ETV Bharat / entertainment

నాగార్జున మూవీ కోసం అలియా భట్ తండ్రి హైడ్రామా - హీరోయిన్​ను చంపేసి! - పూనమ్ పాండే ఫేక్ డెత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తండ్రి, దర్శకనిర్మాత మహేశ్ భట్​ - నాగార్జున్ సినిమా కోసం ఓ హీరోయిన్​ను చంపేశారట!. కానీ యా తర్వాత ఆమె తిరిగి రావడంతో ఆ విషయం అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ఏంటి షాకింగ్​గా ఉందా చదువుతుంటే. దాని గురించే ఈ కథనం.

నాగార్జున మూవీ కోసం అలియా భట్ తండ్రి హైడ్రామా - హీరోయిన్​ను చంపేసి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 10:01 AM IST

Updated : Feb 7, 2024, 11:32 AM IST

Manisha Koirala Fake Death : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్​లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్​గా నటి పూనమ్ పాండే చేసిన డెత్ డ్రామా హంగామా అందరికీ తెలిసిందే. ఎందుకంటే తన గర్భాశయ క్యాన్సర్​తో చనిపోయినట్లు అందర్నీ నమ్మించి ఫూల్స్​ చేసింది. ఆ తర్వాత గర్భాశయ క్యాన్సర్​పై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ఫేక్ ప్రచారం చేసినట్లు చెప్పి తీవ్ర విమర్శకులను ఎదుర్కొంది.

అయితే ఫేక్​ ప్రచారం కొత్తేం కాదు. గతంలోనూ ఫిల్మ్​ ఇండస్ట్రీలో పూనమ్ పాండే కన్నా ముందే మరో హీరోయిన్​ను​ ఓ సినిమా కోసం చంపేశారట! బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ అలియా భట్ తండ్రి, దర్శకనిర్మాత మహేశ్​ భట్ ఇలా చేశారు. ఓ సినిమా ప్రచారం కోసం హీరోయిన్ చనిపోయినట్టు ప్రచారం చేశారట. ఆ సినిమా మరెదో కాదు టాలీవుడ్ కింగ్​ నాగార్జున, మనిషా కొయిరాలా, రమ్యకృష్ణ కలిసి నటించిన 'క్రిమినల్'.

ఈ చిత్రాన్ని హిందీలో అలియా భట్ తండ్రి మహేశ్ భట్ రిలీజ్ చేశారు. అప్పటికే 'క్రిమినల్'(Nagarjuna Criminal Movie) చిత్రం తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇది విడుదల అయ్యాక కొంతకాలానికి హిందీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం కోసమే నిర్మాత మహేశ్​ భట్ మనిషా కొయిరాలా మృతి అంటూ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేలా ప్రచారం చేశారట. అప్పటికే మనిషా కొయిరాలా కూడా పెద్ద హీరోయిన్. ఇది చూసిన చాలామంది షాక్ అయిపోయారు.

కానీ ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్స్ కోసం ప్రచారం చేసినట్లు మహేశ్ భట్​ చెప్పడంతో ఆయనపై చాలా మంది పెద్ద ఎత్తువ విమర్శలు చేశారు. కేసులు కూడా పెట్టారు. దీంతో ఆయన తాను ఎందుకు అలా చేశారో వివరణ ఇచ్చారు. అమెరికన్ సినిమా ఫ్యూజిటివ్ మూవీ కోసం ఆ చిత్ర నిర్మాతలు ఇలాగే చనిపోయినట్టు ఫేక్ ప్రచారం చేశారట. దానిని అనుసరించే తాను కూడా ఇలా చేసినట్లు మహేశ్ భట్ చెప్పుకొచ్చారు. అలా పబ్లిసిటీ కోసం క్రిమినల్ మూవీ టీమ్​ చేసిన ఫేక్ ప్రచారం ఎంతగానో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా పూనమ్ పాండే ఫేక్ డెత్ డ్రామా హాట్​ టాపిక్​గా మారడంతో మనిషా కోయిరాలా ఫేక్​ డెత్​ ప్రచారాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరో‌ షూస్ మోసిన అసిస్టెంట్‌ - ఇప్పుడు సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే స్టార్​!

షాకింగ్​ : విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్​

Last Updated : Feb 7, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.