Manam Movie Rerelease Nagachaitanya Samantha : నాగ చైతన్య - సమంత విడిపోయి చాలా కాలం అయిపోయింది. అయినా కూడా వీరిద్దరికి సంబంధించిన చిన్న వార్త బయటకు వస్తే ఇట్టే వైరల్ అవుతుంటుంది. అలానే వీరిద్దరు ఏమైనా స్పందించిన కూడా అది మరింత చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా సమంతతో తాను చేసిన రొమాన్స్‌పై రియాక్ట్ అవుతూ కనిపించారు చైతూ! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే - అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, చైతూ, సమంత, శ్రియా, అఖిల్ ఇలా అందరూ కలిసి నటించిన సినిమా మనం. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అక్కినేని ఫ్యామిలీకి ఈ మూవీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. మరెన్ని హిట్లు పడినా కూడా మనం సినిమాను మించిన ప్రత్యేకం మరొకటి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాను విక్రమ్ కే కుమార్ ఓ మరుపురాని చిత్రంగా మలిచి హిట్‌ను అందించారు. అనూప్ అద్భుతమైన తన సంగీతంతో మెస్మరైజ్ చేశాడు.
ఇప్పుడీ మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో స్పెషల్ షో ప్రదర్శించారు. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. నాగ చైతన్య, నాగార్జున, సుప్రియ సహా పలువురు థియేటర్‌కు విచ్చేసి సినిమాను వీక్షించారు.
ఈ క్రమంలోనే మనం మూవీ చూస్తూ సుప్రియ కంటతడి పెట్టుకుంది. తాతను స్క్రీన్ పై అలా చూసే సరికి కన్నీరు ఆగలేదంటూ ఎమోషనల్ అయింది. మరోవైపు ఇంకో వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. ఇందులో అభిమానులు ఈలలు వేస్తూ గోల చేస్తూ మనం సినిమా చూస్తుంటే వారి మధ్య ఉన్న నాగ చైతన్య కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది!
అందుకు కారణం లేకపోలేదు. మనం సినిమాలో భాగంగా సమంత, నాగ చైతన్య కలిసి నటించిన రొమాంటిక్ సీన్ తెరపైకి వచ్చింది. అది కనపడగానే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు గోల చేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీంతో నాగ చైతన్య వారందరిని సైలెంట్‌గా కూర్చొండి అన్నట్టుగా సైగ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన వారు చైతూ కాస్త ఇబ్బంది పడినట్లుగా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ వెంట పడిన 25 మంది తమిళ దర్శకులు!
అనసూయ జలకాలాట - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ చూశారా? - Anasuya Vacation Tour Pics