ETV Bharat / entertainment

'శ్రీమంతుడు' స్టోరీ కాంట్రవర్సీ - మూవీ టీమ్ రిప్లై - ఏమందంటే? - శ్రీమంతుడు మూవీ స్టోరీ

Mahesh Babu Srimanthudu Movie : 'శ్రీమంతుడు' మూవీ స్టోరీపై జరుగుతున్న కాంట్రవర్సీపై తాజాగా చిత్రబృందం స్పందించింది. ఇంతకీ ఏమైందంటే ?

Mahesh Babu Srimanthudu Movie
Mahesh Babu Srimanthudu Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 6:44 AM IST

Mahesh Babu Srimanthudu Movie : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌ బాబు లీడ్​ రోల్​లో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' మూవీ కాపీరైట్ సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కాంట్రవర్సీపై మూవీటీమ్​ స్పందించింది. ప్రస్తుతం ఈ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది.

" శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ ఈ రెండూ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించిన వారు ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్‌ రివ్యూలో ఉంది. అందువల్ల ఈ విషంయపై అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మేము మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కాస్త ఓపిక పట్టండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అంటూ మూవీ టీమ్​ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందించారు. ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూలో ఆయన ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడారు.

"2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. ఆ స్టోరీతో ఓ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని డైరెక్టర్​ సముద్రను కలిశాను. అయితే మేం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే కొరటాల శివ 'శ్రీమంతుడు' విడుదలైంది. అది చూసి మా స్నేహితులు అది నా కథేనన్నారు. దాంతో నేను కూడా ఆ సినిమాను చూశాను. అయితే నేను రాసిన స్టోరీలో ఉన్నట్లుగానే స్క్రీన్‌పై చూసి షాకయ్యను. ఆ తర్వాత డైరెక్టర్​తో మాట్లాడాను. ఇది నా స్టోరీనే అని చెప్పాను. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. సినీ పెద్దలు కొంతమంది కూడా ఈ వ్యవహారంలో రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. రూ.15 లక్షలు ఇస్తామని అన్నారు. అయితే ఈ విషయంలో నాకు రచయితల అసోసియేషన్ ఎంతో సాయం అందించింది. వాళ్ల సహకారంతోనే నేను కోర్టును ఆశ్రయించాను. ఈ స్క్రిప్ట్‌ నాదేనని అంగీకరించమని కోరుతున్నాను" అని శరత్‌ చంద్ర అన్నారు.

అసలేం ఏం జరిగిందంటే..?
2015లో విడుదలైన 'శ్రీమంతుడు’' మూవీ అటు టాక్​ పరంగా హిట్ అందుకోవడమే కాకుండా ఇటు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఆ సమయంలోనే ఆ సినిమాను తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రైటర్​ శరత్‌ చంద్ర హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, డైరెక్టర్​ కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే ఆయన క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శ్రీమంతుడు' కథపై వివాదం - కొరటాల శివకు సుప్రీంలో చుక్కెదురు

ఆ రికార్డు సాధించిన తొలి తెలుగు చిత్రం 'శ్రీమంతుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.