ETV Bharat / entertainment

'లాలా సలామ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది- ఆ ఒక్కటే మిస్సైంది! - Lal Salaam Release Date

Lal Salaam Telugu Trailer: సూపర్ స్టార్​ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్' మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్​ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.

Lal Salaam Telugu Trailer
Lal Salaam Telugu Trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 8:20 PM IST

Updated : Feb 7, 2024, 8:47 PM IST

Lal Salaam Telugu Trailer: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు ట్రైలర్ రిలీజైంది. మంగళవారం తమిళ ట్రైలర్​ రిలీజ్​కాగా బుధవారం (ఫిబ్రవరి 07)న మేకర్స్ తెలుగు ట్రైలర్​ విడుదల చేశారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అయితే కొన్నేళ్లుగా రజనీకాంత్​కు తెలుగులో సింగర్ మనో డబ్బింగ్ చెప్పేవారు. కానీ, ఈ సినిమాలో ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఛేంజ్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో సాయికుమార్ లాల్ సలామ్​లో రజనీకి డబ్బింగ్ చెప్పారు. దీంతో సూపర్​స్టార్ వాయిస్​లో ఏదో మిస్సైంది అంటూ ఫ్యాన్స్​ అంటున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ మీరు చూశారా?

పల్లెటూరి నేపథ్యంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఊర్లో వర్గాల మధ్య గొడవలు, రాజకీయాల అంశాలు ముఖ్యమైనవిగా చూపించారు. 'బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం' అంటూ రజనీ డైలాగ్స్ ట్రైలర్​లో హైలైట్​గా ఉంది. ఇక టీమ్ఇండియా దిగ్గజం కపిల్ దేవ్​ను కూడా ట్రైలర్​లో చూపించారు. ఊర్లో జరిగే అల్లర్లకు క్రికెట్ మ్యాచ్ పరిష్కారమా? మొయిదీన్ భాయ్‌ (రజనీకాంత్) పాత్ర ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే.

Lal Salaam Cast: సినిమాలో రజనీకాంత్​తోపాటు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌,ధన్యా బాలకృష్ణన్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కపిల్ దేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఆమె దాదాపు 33 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై సుభాస్కరణ్ ఈ సినిమాను తమిళ్​ సహా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.

Rajinikanth Remuneration: 'లాల్​ సలామ్'​ మూవీ కోసం రజనీ రెమ్యునరేషన్​పై పలు కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర కేవలం అరగంట ఉంటుందట. దానికోసం తలైవా దాదాపు రూ.40 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అప్పుడే నిర్ణయించుకున్నా అలా చేయకూడదని : రజనీకాంత్‌

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Last Updated : Feb 7, 2024, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.