ETV Bharat / entertainment

'రిలేషన్​లోనే ఉన్నాను - ఆయనంటే నాకు చాలా ఇష్టం' - Krithi Shetty Manamey Movie - KRITHI SHETTY MANAMEY MOVIE

Actress Krithi Shetty Relationship : యంగ్ బ్యూటీ కృతి శెట్టి తన రిలేషన్​షిప్​ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెనప్​ అయ్యింది. అంతే కాకుండా తనకిష్టమైన స్టార్ ఎవరో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆయన ఎవరంటే?

Krithi Shetty Relationship
Krithi Shetty Relationship (ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 10:06 AM IST

Actress Krithi Shetty Relationship : తొలి సినిమాతోనే హిట్ టాక్ అందుకుని టాలీవుడ్​లో పాపులరైంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. 'ఉప్పెన'లో బేబమ్మగా కనిపించి కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది, ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు సొంతం చేసుకుని దూసుకెళ్లింది. అయితే అందులో పలు సినిమాలు యావరేజ్​గా రన్ అవ్వడం వల్ల ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన ఛాన్స్​ కోసం ఎదురుచూసింది. అలా ఎట్టకేలక 'మనమే' సినిమాలో ఛాన్స్ సంపాదించుకుంది. శర్వానంద్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ద్వారా ఈ మూవీలో కృతి రోల్​ చాలా స్ట్రాంగ్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా జూన్ 7న విడుదలవ్వనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్​ మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్​లో బిజి బిజీగా గడుపుతోంది. వీళ్లతో పాటు కృతి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటోంది.

ఈ క్రమంలో ఓ యాంకర్ 'మీరు సింగిలా? లేకుంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?' అంటూ అడగ్గా, దానికి ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. " నా పనితోనే నేను రిలేషన్‌లో ఉన్నాను" అంటూ నవ్వింది. ఇది విన్న యాంకర్ ఒక్కసారిగా అవాకయ్యారు. నెటిజన్లు కూడా ఈ విషయం విని షాకయ్యారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన ఫేవరట్ హీరో గురించి ఓపెనప్ అయ్యారు. తనకు రామ్​ చరణ్ అంటే ఎంతో ఇష్టమని​చెప్పుకొచ్చింది.

"గతంలో నేను కొన్ని తెలుగు సినిమాలు చూశాను. అయితే 'రంగస్థలం' సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. అందులో రామ్ చరణ్​ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. అప్పట్నుంచి ఆయనకు నేను పెద్ద ఫ్యానైపోయాను. అంతే కాకుండా ఆయన గురించి నేను చాలా విన్నాను. పని చేస్తున్న సమయంలో ఎంతో డెడికేటెడ్​గా ఉంటారు అని, అందరితో చాలా బాగా ఉంటారని, అందరికి మర్యాద ఇస్తారని విన్నాను. రామ్ చరణ్​తో నటించే అవకాశం వస్తే నేను చాలా ఎగ్జైటడ్​గా ఫీల్ అవుతాను. అలాగే ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఆ మూవీ కోసం ఇంకా ఎక్కువ హార్డ్​వర్క్ చేస్తాను" అంటూ కృతి తన మనసులో మాట బయటపెట్టింది.

అటు బాబు ఇటు కృతి -'ఇద్దరిలో ఒకరే ఏడవండి' అంటున్న శర్వా! - Sharwanand Manamey Teaser

'అవి నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి - ఇలాంటివి నేను ఊహించలేదు ' - కృతిశెట్టి - KRITHI SHETTY ON NEGATIVE COMMENTS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.