Prabhas Kalki 2898 AD Movie : మరో రెండు రోజుల్లో ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ 'కల్కి' (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు ఎంతో శక్తిమంతమైన అశ్వత్థామ పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ పాత్రలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కనిపించారు.
అయితే తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు కమల్, బిగ్ బీ. కమల్ హాసన్ ఈ సినిమాను తాను అంగీకరించడానికి ఏడాది ఆలోచించినట్లు తెలిపారు. అమితాబ్ కల్కి రిలీజ్‌కు ముందు రామచరితమానస్ చదువుతున్నట్లు పేర్కొన్నారు.
Kalki 2898 AD Movie Kamal Hassan : కమల్ హాసన్ మాట్లాడుతూ "ఈ పాత్ర గురించి వివరించగానే నాకు స్వీయ సందేహం వచ్చింది. అసలు దీన్ని చేయగలనా అని భావించాను. గతంలో చాలా చిత్రాల్లోనూ విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించి ఉంటుంది. చాలా భిన్నమైన పాత్ర. అందుకే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఏడాది ఆలోచించాను" అని చెప్పారు.
Kalki 2898 AD Movie Amitabh Bachan : ఇక అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. "కల్కి విడుదలకు ముందు రామచరితమానస్ చదవుతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఎన్ని యుగాలు గడిచినా కొన్ని శాశ్వతంగా నిలిచిపోతాయి. శాశ్వతమైన శాంతి, ప్రశాంతత కోసం నేను ప్రార్థిస్తున్నాను. దీన్ని ఎప్పుడైనా, ఎవరైనా చదవొచ్చు" అని రాసుకొచ్చారు. అలానే అందులోని పద్యాలకు అర్థాలను వివరించారు.
ఏం తింటున్నారో - రీసెంట్‌గానే దర్శకుడు నాగ్ అశ్విన్‌పైనా అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. "కల్కిలో విజువల్స్ అన్నింటినీ తెరపై అద్భుతంగా చూపించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగ్ అశ్విన్ నాకు ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ఈ వ్యక్తి ఏం తింటున్నాడు. ఇంత గొప్పగా రాశాడు అని నేను చాలాసేపు అనుకున్నాను" అని పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా నటిస్తున్నారు.
దుమ్మురేపుతున్న 'కల్కి' బుకింగ్స్ - 5 లక్షలకు పైగా టికెట్లు సోల్డ్ ఔట్! - kalki 2898AD Bookings
'కల్కి' టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఎంత పెరిగాయంటే?