ETV Bharat / entertainment

'భారతీయుడు -2' రిలీజ్ డేట్ కన్ఫార్మ్- 'మరి గేమ్​ఛేంజర్ సంగతేంటి'? - Bharateeyudu 2 release - BHARATEEYUDU 2 RELEASE

Bharateeyudu 2 release Date: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో రూపొందిన సినిమా 'భారతీయుడు -2'. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయ్యింది. సినిమా ఎప్పుడు రానుందంటే?

Bharateeyudu 2
Bharateeyudu 2 (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 9:39 AM IST

Updated : May 20, 2024, 10:00 AM IST

Bharateeyudu 2 release Date: విశ్వ నటుడు కమల్ హాసన్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' విడుదలకు సిద్ధమైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు రిలీజ్‌ డేట్ లాక్ చేసుకుంది. 2024 జులై 12న ఈ మూవీ ఆడియెన్స్​ ముందుకు రానున్నట్లు మేకర్స్ అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. ఇప్పటికి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా, ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడం వల్ల ఫ్యాన్స్​ ఖుషి అవుతున్నారు.

ఇక రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అవ్వడం వల్ల మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్​ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 22న సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక జూన్ 1న చెన్నైలో ఆడియె లాంఛింగ్ ప్రోగ్రామ్​ను గ్రాండ్​గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్​లో మ్యూజిక్ డెరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ స్పెషల్ పెర్ఫార్మెన్స్​తో ఆడియెన్స్​ను అలరించనున్నట్లు తెలుస్తోంది.

కమల్- శంకర్ కాంబినేషన్‌లో 1996లో రిలీజైన 'భారతీయుడు' గొప్ప సక్సెస్ సాధించి ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి అదే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా కావడం వల్ల ఆడియెన్స్​లో భారతీయుడు- 2పై భారీ అంచనలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. లైకా ప్రొడక్షన్స్​ బ్యానర్​పై సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో కమల్​తోపాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సిద్దార్థ్, గుల్షన్ గ్రోవర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.

మరి గేమ్ ఛేంజర్ సంగతేంటి?

స్టార్ డైరెక్టర్ శంకర్ 'భారతీయుడు-2'తోపాటు గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ 'గేమ్​ఛేంజర్' సినిమాను ఒకే సమయంలో తెరకెక్కించారు. అయితే 'భారతీయుడు వచ్చేస్తుంది? మరి గేమ్​ఛేంజర్ పరిస్థితి ఏంటి' అని చెర్రీ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. అయితే గేమ్ ఛేంజర్ ఇంకా 50 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు సినీవర్గాల టాక్. అందులో రామ్​చరణ్ షెడ్యూల్ 20 రోజులు షూటింగ్​ చేయాలంట. దాదాపు సినిమా షూటింగే ఇంకో రెండు నెలల పాటు జరగాల్సి ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు, ప్రమోషన్స్​​ అన్నీ పూర్తి చేసుకొని సినిమా రావాలంటే కనీసం 3- 4 నెలలు పట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భారతీయుడు 2' రిలీజ్​లో ట్విస్ట్- విడుదల మళ్లీ వాయిదా- వచ్చేది అప్పుడే! - Indian 2 Release Date

'సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు'- భారతీయుడు 2 రిలీజ్ ఎప్పుడంటే ? - Bharateeyudu 2 Release Date

Last Updated : May 20, 2024, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.