Kalki Movie Postponed: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటించిన 'కల్కి 2898 AD' సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 'కల్కి 2898 AD' 2024 మే 9న విడుదల కావాల్సి ఉండగా, భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూవీ పోస్ట్‌పోన్ కానున్నట్లు సమాచారం. దీంతో మే 31న లేదా బాహుబలి- 1 రిలీజైన జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే!
ఈ సినిమా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ఆరు వేల సంవత్సరాల కిందట మొదలై 2898 సంవత్సరంలో ముగుస్తుందని అందుకే సినిమా టైటిల్లో ఈ సంవత్సరాన్ని జత చేశారనీ అంటున్నారు. టైమ్ ట్రావెల్ సినిమాలు మనకు కొత్త కానప్పటకీ భారతదేశ భవిష్యత్ నేపథ్యంలో ఎలాంటి చిత్రాలు రాలేదనీ, దీంతో ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ముంబయిలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా 'కల్కి 2898 AD' సినిమా ఎలా ఉంటుంది? సైన్స్ ఫిక్షన్ జానర్ అంటే ఏంటి? ఈ అంశాలపై ఓ అవగాహన కల్పించేలా సినిమా థియేటర్లలోకి రాకముందు ఓటీటీలో ప్రీల్యూడ్ వీడియో రిలీజ్ చేయనున్నారు. ఇది యానిమేటెడ్ వీడియో. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్‌కు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారంట. ఈ వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగా సినిమా టీజర్, తర్వాత పాటలు, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసి చివరగా ఈ ప్రీల్యూడ్ వీడియో విడుదల చేయనున్నారు.
ఇక 'మహానటి', 'జాతి రత్నాలు' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. సైన్ప్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుండగా, దిశా పటానీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ ఇటలీలో జరిగ్గా అక్కడ సెట్లో ప్రభాస్, దిశా పటానీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan
దీపికా పదుకొణె - 'కల్కి' కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?