Kalki Actor ETV Bharat Exclusive: జూన్ 27న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 AD' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా వంటి ప్రముఖ యాక్టర్లతో పాటు బెంగాల్ నటుడు సాస్వత్ ఛటర్జీ కూడా నటించాడు. 2012లో సుజోయ్ ఘోష్ మూవీ 'కహానీ'లో బాబ్ బిస్వాస్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు శాశ్వత ఛటర్జీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'కల్కి 2898 AD'లో అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ఈ బెంగాలీ యాక్టర్ ‘ఈటీవీ భారత్’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈటీవీ భారత్: కల్కి 2898 AD మూవీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
సాస్వత్ ఛటర్జీ: నా పాత్ర కమాండర్ మానస్. పాత్ర గురించి పూర్తిగా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నేను యష్ కింగ్ (కమల్ హాసన్) కింద పని చేస్తుంటాను.
ఈటీవీ భారత్: నాగ్ అశ్విన్‌తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
సాస్వత్ ఛటర్జీ: చాలా బాగుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. బయటి నుంచి చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. లేకుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అవకాశం ఉండేది కాదు. బయటి నుంచి అతన్ని చూస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగలడని నమ్మలేరు.
ఈటీవీ భారత్: అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే లాంటి స్టార్లతో కలిసి పని చేశారు. వారితో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
సాస్వత్ ఛటర్జీ: అందరూ ప్రొఫెషనల్. వాళ్లకు ఇతరుల పట్ల అపారమైన గౌరవం ఉంటుంది. పని వేళల్లో పని ఎక్కువగా ఉండేది. కాబట్టి వారితో ఉన్న ఏదైనా ప్రత్యేక అనుభవాన్ని చెప్పడం కష్టం. అక్కడ పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, అంతే చెప్పగలను.
ఈటీవీ భారత్: ముంబయిలో పనిచేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఆతిథ్యం లభించింది? తెలుగు ఇండస్ట్రీ అందుకు భిన్నంగా ఉందా?
సాస్వత్ ఛటర్జీ: అక్కడ నాకు చాలా మంచి ఆతిథ్యం లభించింది. ఇక్కడ కూడా నాకు మంచి ఆతిథ్యం దక్కింది.
ఈటీవీ భారత్: బెంగాలీ డైరెక్టర్ మానసి సిన్హా విష్ లిస్ట్‌లో ఉన్నారని విన్నాం.
సాస్వత్ ఛటర్జీ: మానసికి నేను వెంటనే వాగ్దానం చేయలేను. షూటింగ్ డేట్స్ సహా మిగతా అంశాలన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ పని చేయగలుగుతాను.
ఈటీవీ భారత్: ఇతర ప్రాజెక్టులు ఏంటి?
సాస్వత్ ఛటర్జీ: హిందీ సిరీస్ 'ఖాకీ 2' జరుగుతోంది. మిగిలినవి ఇప్పుడు చెప్పలేను.
ఈటీవీ భారత్: డిటెక్టివ్ స్టోరీస్‌లో మిమ్మల్ని మళ్లీ ఎప్పుడు చూస్తాం?
సాస్వత్ ఛటర్జీ: మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు చేస్తానో చెప్పలేను.
ఈటీవీ భారత్: ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. రామోజీ రావుని ఎప్పుడైనా కలిశారా?
సాస్వత్ ఛటర్జీ: షూటింగ్ మాత్రమే కాదు. రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా పనులు చేశాను. కానీ ఆయనను కలిసే అవకాశం నాకు రాలేదు. కొన్నిసార్లు ఆయన హెలికాప్టర్ పైకి ఎగురుతుంది. కానీ, అది ఆయనదో కాదో నాకు తెలీదు. అది మాత్రమే చూశాను.
సాస్వత్ ఛటర్జీ బెంగాల్‌లో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాడు. హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. 'దిల్ బేచారా', 'బ్యాడ్ బాయ్', 'దోబారా', 'ధకడ్', 'క్రూ', 'టూత్ ప్యారీ', 'ది నైట్ మేనేజర్' వంటి ప్రతి సిరీస్‌లో, సినిమాల్లో ప్రశంసలు అందుకున్నాడు.
దీపికను ఆటపట్టించిన ప్రభాస్ - ఈ ఫన్నీ వీడియో చూశారా? - Kalki 2898 AD Movie